అదిరిపోయే మెజారిటీతో జగన్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన విషయం తెలిసిందే. అయితే జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైసీపీ శ్రేణులు జగన్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఏడాదిలోనే జగన్ మంచి సీఎం అనిపించుకున్నారని చెబుతున్నారు. అటు టీడీపీ నేతలైతే జగన్ పాలనపై మండిపడుతున్నారు. సంవత్సరంలోనే రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శలు చేస్తున్నారు. ఇంత విధ్వంసకర పాలన తాను ఎన్నడూ చూడలేదని చంద్రబాబు మాట్లాడుతున్నారు.

 

ఈ క్రమంలోనే టీడీపీ నేతలకు కౌంటర్ ఇస్తూనే, జగన్ పాలనని ఏపీ ప్రభుత్వం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశంసించారు. పరిపాలన విషయంలో గానీ, పథకాల విషయంలో గానీ.. సీఎం జగన్‌ ప్రభుత్వాన్ని తప్పుపట్టడానికి ఏమీ లేకుండా పోయిందని, హామీలన్నీ తొలి ఏడాదిలోపే అమలు చేసి జగన్‌ ఆశ్చర్య పరిచారని తెలిపారు. అందుకే ప్రత్యర్థులు తమ సహజసిద్ధమైన లిటిగెంట్‌ స్వభావంతో.. పిటిషన్లు వేసి, కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 

వాస్తవానికి సజ్జల చేసిన కామెంట్లు కరెక్ట్ గానే ఉన్నాయి. పరిపాలన విషయంలో జగన్‌ ఊహించని నిర్ణయాలే తీసుకున్నారు. అవి ప్రతిపక్షాలకు నచ్చకపోయినా, ప్రజలకు మాత్రం నచ్చాయి. ఇక సంక్షేమ పథకాల గురించి అయితే చెప్పాల్సిన పనిలేదు. ఏడాది లోనే ఊహించని విధంగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందించారు. మేనిఫెస్టోలో చెప్పిన హామీల్లో దాదాపు 80 శాతం హామీలని అమలు చేశారు.

 

అయితే అంతా బాగానే ఉన్న అభివృద్ధి మాత్రం పెద్దగా జరిగిన దాఖలాలు లేవని విశ్లేషుకులు అంటున్నారు. ఈ ఏడాదిలో అనుకున్న అభివృద్ధి జరగలేదని, కాకపోతే మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర అభివృద్ధికు బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అలాగే కేంద్రం నుంచి ప్రత్యేక హోదా, కడప స్టీల్ ప్లాంట్, ఇంకా పలు కేంద్ర సంస్థలు వస్తే అభివృద్ధి ఆటోమేటిక్‌గా జరుగుతుందని, ఈ నాలుగేళ్లలోనైనా ఆ విషయంపై కాస్త దృష్టి పెడితే మంచిదని సలహాలు ఇస్తున్నారు. మరి చూడాలి రాబోయే నాలుగేళ్లలో రాష్ట్రంలో అభివృద్ధి ఎంతమేర జరుగుతుందో?

 

మరింత సమాచారం తెలుసుకోండి: