ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో నిమ్మగడ్డ వ్యవహారం రోజు రోజుకి తీవ్రతరంగా మారుతోంది. ఈ విషయంలో ఏ రోజు ఏ విధమైన ట్విస్ట్ వస్తుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. మొన్న హైకోర్టు లో ఎన్నికల కమిషనర్ వ్యవహారం అనేది పూర్తిగా రాజ్యాంగబద్ధమైన అంశమని ఈ విషయంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు జోక్యం చేసుకోకూడదు అంటూ హైకోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేయటం మనకందరికీ తెలిసిందే. ఈ విషయం పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాజాగా ఏపీ ప్రభుత్వం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి రెడీ అయ్యింది.

IHG

విషయం ఇలా ఉండగా అటు నిమ్మగడ్డ కంటే ఎక్కువగా ఈ విషయంలో కంగారు పడిపోతున్నారు సీపీఐ నేత రామకృష్ణ. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవిలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే  కొనసాగించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కోర్టు తీర్పు తర్వాత ఏజీ శ్రీరామ్ క్లారిటీ ఇచ్చిన విధానాన్ని తప్పుపడుతూ ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నే కొనసాగించాలని కొందరు పొలిటికల్ లీడర్స్ అత్యుత్సాహంగా డిమాండ్ చేయటం అందరికీ షాక్ ఇస్తోంది.

IHG

ఇదే టైమ్ లో టిడిపి నేతలు కూడా ఎక్కువ కంగారు పడిపోతున్నారు. అసలు ఎన్నికల కమిషనర్ ఎవరైతే రాజకీయ పార్టీలకు ఏమిటి? రాష్ట్రంలో జరిగే ఎన్నికలలో అవకతవకలు జరగకుండా నిర్వహించడం వారి బాధ్యత. ఇటువంటి రాజ్యాంగపరమైన పదవి విషయంలో పార్టీలు కలుగజేసుకోవటం అత్యుత్సాహం చూపటం ఏమిటో అసలు ఎవరికీ అర్థం కావడం లేదు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: