కేరళలో గత కొద్దీ రోజులనుండి భారీ సంఖ్య లో కేసులు నమోదవుతుండగా ఈరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా 57కేసులు నమోదయ్యినట్లు ముఖ్యమంత్రి  కార్యాలయం వెల్లడించింది. అందులో 55కేసులు విదేశాల నుండి వచ్చినవి కావడం గమనార్హం. ఇక అలాగే ఈరోజు కరోనా తో ఒకరు మృతి చెందగా 18 మంది బాధితులు కోలుకున్నారు.  ఈ కొత్త కేసులతో కలిపి కేరళ లో మొత్తం కేసుల సంఖ్య 1326కు చేరగా అందులో 608మంది బాధితులు కోలుకోగా ఇప్పటివరకు10 మంది మరణించారు. ప్రస్తుతం 708 కేసులు యాక్టీవ్ గా వున్నాయి. 
ఇక మిగితా రాష్ట్రాల విషయానికి వస్తే తమిళనాడు లో ఈరోజు కూడా రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి.రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఒక్కరోజే  1162 కేసులు నమోదు కాగా మొత్తం కేసుల సంఖ్య 23495కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు భారీగా కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోఈరోజు 76కేసులు నమోదు కాగా తెలంగాణ లో 94కేసులు బయటపడ్డాయి అలాగే ఆరుగురు మరణించారు. ఆరాష్ట్రం లో కరోనా మరణాల సంఖ్య 88కి చేరింది. ఓవరాల్ గా దేశంలో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 195000 దాటింది. నేటి నుండి దేశ వ్యాప్తంగా 5వదశ లాక్ డౌన్ అమలులోకి వచ్చింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: