కొంతమంది లో కొన్ని కొన్ని మ్యానరిజాలు ఉంటాయి. అవి మంచివైనా, చెడ్డవైనా, మార్చుకునేందుకు ఏ మాత్రం ఇష్టపడరు సరికదా ... అదే గొప్పగా భవిస్తూ, ఎవరైనా అది తప్పు అని చెప్పే కొద్దీ, మరింతగా రెచ్చిపోతూ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తుల్లో సినీ హీరో నందమూరి బాలకృష్ణ ముందు వరుసలో ఉంటున్నారు. చాలా కాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా బాలయ్య నిలుస్తున్నారు. వివాదాలు బాలయ్యకు కొత్తేమీ కాకపోయినా, ఆ వివాదాల కారణంగా అనవసర తలనొప్పులూ, విమర్శలు ఎదుర్కుంటున్నారు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు వారసుడిగా బాలకృష్ణ గొప్పే వ్యక్తే . ఆ విషయాన్ని గొప్పగానే చెప్పుకున్నా తప్పు లేదు. కానీ అదే విషయాన్ని గొప్పగా చెప్పుకునే క్రమంలో మేము తప్ప ఇంకెవరూ గొప్ప కాదు అనే భావజాలమే బాలయ్యను అభాసుపాలు చేస్తోంది. 

IHG


బాలయ్య ఆషామాషీ వ్యక్తి ఏమీ కాదు అగ్రశ్రేణి హీరో అంతే కాదు రెండోసారి ఎమ్మెల్యేగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి అన్ని కులాలు అన్ని మతాలను సమానంగా గౌరవించి నడుచుకోవాల్సిన బాధ్యతాయుతమైన ఏదో ఒక సాధారణ వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు తరహాలో చేస్తే ఎవరూ పట్టించుకోరు కానీ, బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి కూడా ఇంకా రాచరికపు వ్యవస్థలు ఉన్నట్టుగా భ్రమపడుతూ, బ్లడ్డు బ్రీడు అంటూ బాలయ్య పదే పదే వ్యాఖ్యానిస్తూ అందరిలోనూ చులకన అవుతున్నాడు. దీనివల్ల బాలయ్యకు కలిసి రాకపోతే నష్టమే ఎక్కువ జరుగుతోంది.

IHG


సమయం సందర్భం వచ్చినా, రాకపోయినా, ఎక్కడపడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడేస్తూ బాలయ్య అందరివాడు కాదు కొందరి వాడిగానే మిగిలిపోతున్నారు. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ తమ వంశం, చరిత్ర అంటూ గొప్పలు చెప్పేందుకు ప్రయత్నిస్తూ మాట్లాడిన తీరు చూస్తుంటే, బాలయ్యలో మార్పు రాలేదని, అదే రాచరికపు పోకడలు ఇంకా ఆయనలో ఉండిపోయాయి అనే విషయం అర్థం అవుతోంది. బాలయ్య ఎవరు ఏం చెప్పినా వినే రకం కాదని, ఆయన తనకు ఏది అనిపిస్తే అది ఏం చేయాలనుకుంటే అది చేస్తూ, ప్రత్యేకమైన వ్యక్తిగా తనను తాను చుసుకుంటారనే విమర్శలు ఆయనపై లేకపోలేదు. సందర్భం వచ్చినా, రాకపోయినా వంశం చరిత్ర అంటూ బాలయ్య చెబుతూ కొందరి వాడు గానే మిగిలిపోతున్నట్టుగానే కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: