ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న   విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముందుగా చిక్కు వచ్చి పడింది మాత్రం జ్యోతిష్యుల కి. ప్రస్తుతం భారతదేశంలో ఎక్కువ మొత్తంలో జ్యోతిష్యాలను  నమ్ముతూ ఉంటారు. కొంతమంది జ్యోతిష్యాలయం గుడ్డిగా నమ్ముతూ ఉంటే కొంతమంది లైట్  తీసుకుంటూ ఉంటారు. అయితే అందరూ ఒకలా ఉండరు కదా ఎవరి నమ్మకం వారికి ఉంటుంది. భవిష్యత్తులో జరిగే వాస్తవాలను ఎప్పుడూ మేము చెబుతూ ఉంటాం  అని కొంత మంది జ్యోతిష్కులు చెబుతుంటారు. ఇలా ఫేమస్ అయిన వాళ్ళు దేశంలో చాలామంది ఉన్నారు. అయితే తాజాగా అలాంటి వారికి చిక్కులు వచ్చిపడ్డాయి. 

 

 


 తెలుగు రాష్ట్రాల్లో ప్రజలకు ముఖ్యమంత్రులకు బాగా సుపరిచితుడు  అయినటువంటి స్వరూపానందేంద్ర స్వామి కరోనా  వైరస్ గురించి గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన స్వరూపానందేంద్ర స్వామి మే నెల సగం నుంచి కరోనా వైరస్ తగ్గిపోతుందని అంతా ప్రశాంతత నెలకొంటుందని అని చెప్పారు. కానీ కరోనా వైరస్ తగ్గలేదు కదా మే నెల నుంచి మరింతగా పెరిగిపోతుంది. ఇక కర్ణాటకలో అభిజ్ఞ కూడా  ఇలాగే చెప్పారు. కర్ణాటకలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువైన అభిజ్ఞ మే నెల నుంచి కరోనా  వైరస్ ప్రభావం తగ్గిపోతుంది.. సాధారణ పరిస్థితులు ఏర్పడుతుంది అని తెలిపినప్పటికీ మే నెల నుంచి దేశంలో మరిన్ని కేసులు నమోదు కూడా పెరగటం  మొదలయ్యాయి. 

 

 

 ఇక ఇప్పుడు మరో వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ కి సంబంధించిన బేజాన్ దరువాలా అనే వ్యక్తి... గతంలో ఎన్నో భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు చెప్పానని...చెప్పినవి   చెప్పినట్టుగానే జరిగాయని చెప్పు కుంటూ ఉంటారు. ఈయనకు ఏకంగా ఐదు కోట్ల మంది కస్టమర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈయన వెబ్సైటు  అయితే ఏకంగా 150 దేశాల ఫాలో అవుతున్నారు. ఇక ఆయన కూడా మే నెల నుంచి కరోనా  వైరస్ ప్రభావం తగ్గిపోతుంది అని చెప్పారు. అయితే కరోనా  వైరస్ ప్రభావం తగ్గిపోవడం ఏమో కానీ ఏకంగా ఆయన చనిపోయారు. ఆయన కరోనా  వైరస్ గురించి చెప్పడంతో కరోనా  ద్వారానే మరణించారని ఒక వార్త హల్చల్ చేసినప్పటికీ ఆరోగ్య సమస్యల కారణంగా చనిపోయారు  కుటుంబ సభ్యులు చెప్పారు. ఇలా ఎంతో మంది ప్రముఖ జ్యోతిష్యులు చెప్పిన  ఎక్కడ ఫలితం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: