ప్రస్తుతం భారతదేశంలో కరోనా  వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకు విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్న కేసులు ఒక ఎత్తయితే కేవలం మహారాష్ట్ర ఒక్క రాష్ట్రంలో ఉన్న కేసులు ఒక ఎత్తు. మహారాష్ట్రలో కరోనా వైరస్ కేసులు అకౌంట్ 60,000 దాటిపోయింది. మహారాష్ట్రలో  తక్కువ స్థలంలో ఎక్కువ జనాభా ఉండడం... అటు ప్రభుత్వం కరోనా  వైరస్ కట్టడికి సమర్థవంతంగా చర్యలు తీసుకోకపోవడం లాంటివి అక్కడ భారీగా కేసులు పెరిగి పోవడానికి కారణమైంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వం తీరు  వేగంగా దేశానికి రోజురోజుకు శాపంగా మారిపోతుంది. అయితే మొన్నటివరకు కరోనా వైరస్ వ్యాప్తి పై ఉద్ధవ్ థాక్రే సర్కార్ మౌనంగానే ఉన్న విషయం తెలిసిందే. 

 

 కానీ ఇప్పుడు మాత్రం ఉద్దవ్ థాక్రే  సర్కార్ మహారాష్ట్రలో  కరోనా వైరస్ వ్యాప్తిని ఇతరులపై వేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అక్కడ కేవలం ఎన్నారైలు ద్వారానే కాకుండా మర్కజ్  ద్వారా కూడా ఎక్కువగా కేసులు నమోదయిన  అన్న విషయం దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ ప్రస్తుతం ఉద్ధవ్  సర్కార్ వినిపిస్తున్న వాదన ఏమిటి అంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కారణంగానే కరోనా  వైరస్ వ్యాప్తి చెందింది అని అంటూ ఆరోపణలు చేస్తోంది. దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే... డోనాల్డ్ ట్రంప్ వచ్చిన నాటికి మహారాష్ట్రలు మొదటి కేసు నమోదైన నాటికీ 30 రోజుల తేడా ఉందని.. అంత తేడాతో కరోనా  వైరస్ ఎలా నమోదు అవుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. 

 


 ప్రస్తుతం రోజురోజుకు మహారాష్ట్ర సర్కార్ పై వ్యతిరేకత వస్తున్న తరుణంలో దానిని డైవర్ట్  చేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తోంది అంటూ ప్రస్తుతం విశ్లేషకులు ఆరోపిస్తున్నారు. అయితే మహారాష్ట్రలో ఎక్కువగా కేసులు వ్యాప్తి చెందడానికి కారణం మర్కజ్  సమావేశం అన్న విషయం తెలిసిందే . కానీ మర్కజ్ సమావేశం మీద విమర్శలు చేయకుండా ట్రంప్  మీద విమర్శలు చేయడానికి కారణం ఓటు బ్యాంకు అని అంటున్నారు విశ్లేషకులు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై విమర్శలు చేస్తే ఓట్లు  పోయేది ఏమీ లేదని అదే మర్కజ్  సమావేశంపై చేస్తే మాత్రం అటు ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలుఊరుకోవు...  అంతేకాకుండా మైనార్టీ ఓటింగ్ దెబ్బతింటుందని అందుకనే మర్కజ్  పై కాకుండా ట్రంప్ పైన విమర్శలు చేస్తోంది అంటూ ఆరోపిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: