పాకిస్థాన్ దేశం నుంచి భారత్ పై మిడతల దండు దాడి చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఐదారు రాష్ట్రాలు దాటి తెలుగు రాష్ట్రాల వైపు దూసుకొస్తోంది మిడతల దండు. దీంతో ఇరు  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు మిడతల దండు ఎదుర్కొనేందుకు సన్నద్థంగా అయ్యారు . అదేసమయంలో తెలుగు రాష్ట్రాల రైతాంగం మొత్తం ప్రస్తుతం మిడతల దండు ఎక్కడ దాడి చేసి  తమ పంటలను నాశనం చేస్తుందోనని  ఆందోళన లోనే ఉన్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం టెన్షన్ టెన్షన్ గా మారింది. ఈ నేపథ్యంలో తాజాగా తెలుగు రాష్ట్రాల రైతులకు శాస్త్రవేత్తలు గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణకు మిడతల దండు బెడద  తప్పిపోయిందని ప్రస్తుతం శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

 


 ఎడారి ప్రాంతం నుంచి బయలుదేరిన మిడతల దండు... రాజస్థాన్ గుజరాత్ రాష్ట్రాల  మీదుగా తెలంగాణ రాష్ట్రం వైపు దూసుకు వచ్చాయి. తెలంగాణ రాష్ట్రానికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న విదర్భ ప్రాంతంలో దిశా  మార్చుకొని మధ్యప్రదేశ్ వైపు దూసుకు వెళుతున్నాయి అన్నటువంటి తెలంగాణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మిడతలు ఏకంగా రెండు గ్రాముల నుంచి 5 గ్రాముల బరువు ఉంటాయని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఈ మిడతలు  గాలి ఆధారంగా ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఈరోజు గాలి ఉత్తరం వైపుకి గంటకు 15 కిలోమీటర్ల వేగంతో వీయటం  కారణంగా వాటి దిశను మార్చుకుని మధ్యప్రదేశ్ వైపుగా గాలి వీస్తున్న వైపుగా వెళుతున్నాయి అని  చెబుతున్నారు శాస్త్రవేత్తలు. 

 


 ఉత్తరం వైపుకు గాలి వీయడం వల్ల ప్రస్తుతం మధ్యప్రదేశ్ వైపు దారి మళ్లించాయి. అదే దక్షిణం వైపు వీచి  ఉంటే తెలంగాణలో ఇప్పటికే  ప్రవేశించేది చెబుతున్నారు . ఇక ఈ మిడతలు  ఒక్కరోజులో 100 నుండి 150 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేస్తాయి. అంటే మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావడానికి  మూడు రోజులు సమయం పడుతుంది. మిడతల దండు లో  దాదాపు ఒక కోటి మిడతలు  ఉంటాయట. ఒక ప్రాంతం మీద దాడికి దిగితే 35వేల మంది మనుషులు తినే ఆహారాన్ని ఓకే గంటలు తినేస్తాయట. అయితే ఈ మిడతల  బెడద  తెలంగాణకు తప్ప్పింది అని చెప్పటంతో  రాష్ట్రంలో రైతులు ఊపిరి  పీల్చుకున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: