కరోనా వైరస్ పోరాటంలో ప్రజల తరపున ముందుండి పోరాడుతున్న వారిలో వైద్యులు ఒకరు. కరోనా వైరస్ బారిన పడకుండా ప్రజలను కంటికి రెప్పలా తమ ప్రాణాలను త్యాగం చేస్తూ సేవలు అందిస్తున్నారు. వారికి తోడుగా నర్సులు అదేవిధంగా పారామెడికల్ సిబ్బంది సహకారలుగా ఉంటున్నారు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వైద్యుల విషయంలో అనేక ప్రశంసలు కురుస్తున్నాయి. అటువంటిది పారామెడికల్ సిబ్బంది కి ఇబ్బంది వస్తే ఆదుకునే వారే లేకుండా పోయింది. కనీసం మానవత్వం ఆమెపై చూపించకుండా సహచరులు ప్రవర్తించారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సాగర్ జిల్లాలో జరిగింది. కరోనా వైరస్ రోగులకు చికిత్స అందించడానికి జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి బుందేల్ ఖండ్ లోని మెడికల్ కాలేజీకి పారామెడికల్ సిబ్బంది తరలించడం జరిగింది.

IHG

తిరిగి ఆసుపత్రికి బయలుదేరుతుండగా మధ్యలో ఆకస్మాత్తుగా ఒక వ్యక్తి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే కాపాడాల్సిన తోటి సహోద్యోగులు పట్టించుకోకుండా అలానే చూస్తున్నారు. ఆ సమయంలో వీరంతా పీపీఈ కిట్లలోనే ఉన్నారు. అయినా వారు పట్టించుకోకుండా ఆమె ని రోడ్డుపై అలానే వదిలేసి వెళ్లిపోయారు. దాదాపు అరగంట సేపు సిబ్బందిలో ఉన్న మనిషి రోడ్డుపై నిస్సహాయంగా పడిపోయే ఉంది.

IHG

స్థానికులు గాని రోడ్డుపై అటుగా వెళ్తున్న వారు కానీ ఆమెను పట్టించుకోలేదు. వెంటనే ఇంతలో ఒక అంబులెన్స్ వచ్చి స్పృహతప్పి గాయపడిన వ్యక్తిని రక్షించి ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఈ ఘటన బట్టి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైరస్ అంటే ప్రజలు ఏ స్థాయిలో భయపడుతున్నారో అనేందుకు ఈ సంఘటన ఓ ఉదాహరణగా నిలిచింది. అదే విధంగా మనిషిలో మానవత్వం లేకుండా కూడా పోయిందని అర్ధమవుతోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: