ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఢిల్లీకి వెళ్తున్న విషయం అందరికీ తెలిసిందే. అధికారికంగా ప్రభుత్వం వర్గాలనుండి మీడియాకి కూడా సమాచారం అందింది. లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటిసారి జగన్ ఢిల్లీ టూర్ చేపడుతున్న తరుణంలో ప్రతి ఒక్కరిలోనూ ఉత్కంఠత నెలకొంది. రెండు రోజుల క్రితమే అమిత్ షా జగన్ కి ఫోన్ చేయటం అదే సమయంలో ఆయన అపాయింట్మెంట్ జగన్ కోరటం తో ఇప్పుడు ఈ వార్త ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. ఒకపక్క కరోనా తీవ్రంగా ఉన్నా కానీ ఇలాంటి సమయంలో జగన్ ఢిల్లీ టూర్ వెనకాల బలమైన కారణం ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

 

ఇదే సమయంలో ఢిల్లీ పెద్దలు జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వటం కూడా ఈ విషయం చాలా కీలకమైనదని అంచనా వేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించి ఆర్థిక సాయం అదేవిధంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి ముఖ్యంగా న్యాయస్థానాలలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా వస్తున్న తీర్పులు గురించి చర్చించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినబడుతున్నాయి.

 

పరిపాలన ముందుకు సాగకుండా కొందరు దురుద్దేశంతో కోర్టులో పిటిషను వేస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఏడాదిలోనే అరవై నాలుగు జీవోలను హైకోర్టు కొట్టి వేయటం పట్ల ప్రభుత్వం దీనిపైన గట్టిగానే దృష్టిపెట్టినట్లు సమాచారం. ముఖ్యంగా పరిపాలనలో న్యాయస్థానాలు ఎక్కువగా జోక్యం చేసుకోవటం దాన్ని గురించి జగన్ అమిత్ షా తో చర్చించనున్నట్లు, జగన్ ఢిల్లీ టూర్ వెనుక ఇదే కారణం అన్నట్లు వార్తలు వినబడుతున్నాయి. మొత్తం మీద చాలా కాలం తర్వాత రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న.. జగన్ ఢిల్లీ టూర్ హఠాత్తుగా చేపట్టడం అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: