కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాల పరిస్థితి అంతా తలకిందులు అయిపోతే ఇప్పుడు మరలా కొత్త వైరస్ జనాలను వణికించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే గ్యాస్ లీక్ లు, తుఫాన్ లు, భూకంపాలు అంటూ ఎన్నో భయంకరమైన ఉపద్రవాలను చవిచూసిన 2020 మరొక వైరస్ అటాక్ ను కాచుకోవలసిన పరిస్థితి ఎదురైంది. విషయం ఏమిటంటే రెండు సంవత్సరాల క్రితం యావత్ ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ మళ్లీ మానవజాతి లోనికి ప్రవేశించింది.

 

IHG's spread and new ...

 

మధ్య ఆఫ్రికాలోని డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో లో తాజాగా ఎబోలా కేసులు నమోదు కాగా ఈ వైరస్ వల్ల ఇప్పటికే నలుగురు ప్రాణాలు వదలగా చాలామంది దీని బారిన పడినట్లుగా అధికారులు తెలిపారు. ఆఫ్రికాలోని కాంగో లాంటి దేశంలో ఈ వైరస్ ప్రబలడం చాలా ప్రమాదకరం. అక్కడ మెరుగైన వైద్య సదుపాయాలు ఉండకపోదా దీనిని ఒక అవకాశంగా ఉపయోగించుకుని మిలిటెంట్లు మరియు విప్లవకారులు మరింత హింసాకాండ సృష్టిస్తారు. గతంలో కూడా ఇక్కడ ఇదే జరగింది. 2014లో అయితే ఈ వైరస్ కేవలం మూడు ఆఫ్రికా దేశాల్లోనే 11 వేల మందిని పొట్టన పెట్టుకోవడం గమనార్హం.

 

IHG

 

డీఆర్ కాంగో దేశంలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకూ నగర శివార్లలో ఉన్న ఈ వైరస్ తాజాగా మండక నగరంలోకి ప్రవేశించింది. దీన్ని నియంత్రించటం చాలా కష్టమన్న భయాందోళనలు పెరుగుతున్నాయి. ఎబోలా వ్యాధి సంక్రమణ గురించి చూస్తే... ఆ వ్యాధి బారినపడినవారికి వైద్యం చేసిన నర్సులు, డాక్టర్లు చనిపోయిన ఘటనలు ఉన్నాయి.

 

IHG

 

ఈ వ్యాధి వచ్చినవారిలో కనపడే తొలి లక్షణం.. కనీసం 101 డిగ్రీల జ్వరం. తలనొప్పి విపరీతంగా ఉండటంతో పాటు కండరాలు, కీళ్ల నొప్పులుంటాయి. పొత్తికడుపులో కూడా బాగా నొప్పి వస్తుంది. నీరసంగా మారి బలహీనంగా ఉంటారు. గొంతువాపు, తలతిరగడం, వాంతి వచ్చేట్లు అనిపించడం వంటి వాటితోపాటు అంతర్గత రక్తస్రావం, రక్తపువాంతులు, రక్తవిరేచనాలు, ముక్కు నుంచి రక్తం కారడం వంటి లక్షణాలు కూడా కనపడతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: