ప్రజలకు నిద్రలేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ప్రభావం రోజు రోజుకు  ఉగ్ర రూపమా దాల్చుతూ వస్తుంది.. అయితే లాక్ డౌన్ కారణంగా సినిమా వాయిదా పడ్డాయి.. పేదలను ఆదుకోవడానికి సినీ ప్రజలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు.కరోనా వైరస్  విజృంభిస్తున్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలోని  సినీ కార్మికులను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ముందుకొస్తున్నారు. 

 

 


కాగా, కరోనా వ్యాప్తిని అరికట్టే దిశగా ప్రభుత్వాలు సాగుతున్నాయి. సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా రాకుండా జాగ్రత్తలు తెలుపుతూ వస్తున్నారు.చాలా మంది ప్రముఖులు ప్రజలకు తోచిన సాయాన్ని అందిస్తూ వస్తున్నారు. ఇప్పటికే చాలా మందికి పేదలకు స్వయంగానో లేదా విరాళాలను అందించో ప్రజల కళ్ళల్లో సంతోషాన్ని నింపుతున్నారు. 

 

 

 


చైనాలో కరోనా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వచ్చినట్టే వచ్చి మళ్లీ అలజడి సృష్టిస్తోంది. కొత్తగా కేసులు నమోదవుతుండటంతో మరోసారి లాక్‌డౌన్ ప్రకటిస్తూ చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొవిడ్-19 జన్మస్థానమైన వుహాన్ సిటీ ఉన్న హుబేయి ప్రావిన్స్‌లో కరోనా కట్టడి కోసం చైనా ఇప్పటికే 76 రోజుల పాటు లాక్‌డౌన్ విధించి ఇటీవలే సడలించిన విషయం తెలిసిందే. తాజాగా వుహాన్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో కరోనా కలకలం రేగుతోంది. తాజాగా జిలిన్‌ ప్రావిన్స్‌లో కొత్తగా 34 కరోనా కేసులు బయట పడటంతో అప్రమత్తమైన చైనా అక్కడ లాక్‌డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 

 

 

 

 

రష్యా, ఇతర దేశాల నుంచి తిరిగొచ్చిన చైనా పౌరుల కారణంగా కొత్తగా కేసులు నమోదవుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. కరోనా కేసుల్లో రష్యా రెండో స్థానంలో ఉంది. అమెరికా తర్వాత ఆ దేశంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి. చైనాలోని జిలిన్ ప్రాంతంలో శనివారం అకస్మాత్తుగా మూడు కేసులు నమోదు కాగా.. ఆదివారం మరో రెండు కేసులు నిర్ధారణ అయ్యాయని అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు అవలంబిస్తున్నట్టు జిలిన్‌ రాష్ట్రంలోని షులాన్‌ నగర ప్రభుత్వం తెలిపింది. కరోనా బాధితులు, అనుమానితులు ఉన్న ప్రదేశాలను పూర్తిగా కంటెయిన్‌మెంట్ చేసినట్లు వెల్లడించింది.76 రోజుల పాటు అందరూ లాక్ డౌన్ పాటించాలని తేల్చిచెప్పేసింది..

మరింత సమాచారం తెలుసుకోండి: