భారత వాతావరణ శాఖ చెప్పిన విధంగానే ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు జూన్ 1వ తేదీనే కేరళ తీరాన్ని తాకాయి. అయితే వాతావరణ శాఖ మరో తుఫాను ముప్పు ముప్పు పొంచి ఉందని తెలిపింది. రుతుపవనాల ప్రభావంతో కేరళలో వర్షాలు పడుతున్నాయి. రుతుపవనాల ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది, తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
భారత వాతావరణ శాఖ ఈ సంవత్సరం రుతుపవనాలు బలంగా ఉండటంతో నాలుగు నెలల పాటు సాధారణ వర్షపాతం నమోదు కానుందని తెలిపింది. ఏపీలోని రాయలసీమ, యానాం, ఉత్తర, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విజయవాడ వాతావరణ శాఖ చెబుతోంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. 
 
అంఫన్ తుఫాను విషాదం మరవక మునుపే వాతావరణ శాఖ భారత్ కు మరో తుఫాన్ ముప్పు ఉన్నట్టు ప్రకటించింది. నిన్న ఆగ్నేయ అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు తెలిపారు. అల్ప పీడనం ఈరోజు ఉదయం నాటికి వాయుగుండంగా మారి, అనంతరం తుఫానుగా మారే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. నిసర్గ పేరుతో పిలుస్తున్న ఈ తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. 
 
ఈ తుఫాన్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ తుఫాన్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఈ తుఫాన్ విధ్వంసాన్ని సృష్టించే అవకాశాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు. 120 సంవత్సరాల క్రితం ఇలాంటి భీకరమైన తుఫాన్ ఏర్పడిందని.... మళ్లీ ఇప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: