దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అయితే ఇదే సమయంలో కరోనా విజృంభణ వల్ల ఇబ్బందులు పడుతున్న రైతులను, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకోవడానికి కేంద్రం సిద్ధమైంది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన వీరిపై వరాల జల్లు కురిపించింది. వీరితో పాటు వీధి వ్యాపారులకు కూడా కేంద్రం శుభవార్త చెప్పింది. 
 
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు 20 వేల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తున్నట్టు కేంద్రం తెలిపింది. నిన్న కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం కేంద్రం నుంచి కీలక ప్రకటనలు వెలువడ్డాయి. కేంద్రం సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు 50,000 కోట్ల రూపాయలు ఈక్విటీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నట్టు తెలిపింది. 
 
ఈ పరిశ్రమలను మార్కెట్లో లిస్టింగ్ చేసే అవకాశం కల్పిస్తున్నట్టు పేర్కొంది. కేంద్ర కేబినెట్ వీధి వ్యాపారులకు 10,000 రూపాయల రుణం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. దేశంలోని 50 లక్షల మంది లబ్ధిదారులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం 14 పంటలకు కనీస మద్దతు ధర ప్రకటించడంతో పాటు రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డుల పథకం అమల్లోకి తెస్తామని తెలిపారు. 
 
మరోవైపు నిన్న కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ప్రధాని మోదీ తన సందేశం వినిపించారు. వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోను సహించబోమని మోదీ తెలిపారు. టెలీ మెడిసిన్ లో ఆధునిక, విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చామని..... దేశంలో కోటి పీపీఈ కిట్లను తయారు చేసి కరోనా వారియర్లకు అందజేశామని.... ఆరోగ్యంలో ఐటీ విభాగ సేవలు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని... దేశంలో 12 కోట్ల మంది ఆరోగ్య సేతు యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారని చెప్పారు. కరోనా కట్టడి కోసం కృషి చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కూడా సైనికులేనని  వ్యాఖ్యలు చేశారు 

మరింత సమాచారం తెలుసుకోండి: