ఏపీ బీజేపీ నాయకుల పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. తాము ఎవరిమీద  పోరాడాలి ? ఎవరిపై పోరాడాలో వారికే క్లారిటీ లేకుండా పోయింది. కేంద్ర అధికార పార్టీ అన్న హోదా, దర్పం ప్రదర్శిస్తున్న ఏపీ బీజేపీ నేతలు దానికి అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మాత్రం వెనుకబడి పోతున్నారు. ఎప్పటి నుంచో ఏపీలో బీజేపీ బలపడకపోవడానికి కారణం పరోక్షంగా టిడిపి అధినేత చంద్రబాబే కారణం అనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. చంద్రబాబు తన రాజకీయ ఎత్తుగడలతో ఏపీలో బీజేపీని ఎదగకుండా చేయడంతోపాటు, వారు తన చెప్పుచేతల్లో ఉండే విధంగా చేసుకోగలిగారు. ప్రస్తుత బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కు ముందు కంభంపాటి హరిబాబు ఏపీ బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సమయంలో పూర్తిగా బాబు ఆయనను గ్రిప్ లో  పెట్టుకున్నారని, దీనికి ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా బాగా సహకరించారు అనేది అందరికీ తెలిసిన మాటే. 

IHG


ఆ విషయాన్ని గమనించిన బీజేపీ అధిష్టానం హరిబాబు స్థానంలో చంద్రబాబుకు బద్ద శత్రువుగా ఉంటూ వచ్చిన కన్నా లక్ష్మీనారాయణ కు ఆ బాధ్యతలు అప్పగించింది. మొదట్లో కన్నా టిడిపిని రాజకీయ విరోధిగా చూస్తూ, చంద్రబాబు ఆ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శలు ఎక్కు పెట్టినా, ఆ తరువాత తరువాత పూర్తిగా చంద్రబాబు ట్రాప్ లోకి వెళ్లిపోయారని, వైసీపీ ని మాత్రమే రాజకీయ శత్రువుగా చూస్తూ, చంద్రబాబు కు సన్నిహితంగా మెలుగుతున్నారు అనే విషయం అందరికీ అర్థమైంది. ఇదే విషయాన్ని బిజెపి సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి మొత్తం ఏపీ బీజేపీ నాయకుల బండారాన్ని బయటపెట్టారు. కొద్ది రోజుల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం భూముల వ్యవహారంలో వైసీపీ ప్రభుత్వం పై టీడీపీ, బీజేపీ శ్రేణులు విమర్శలు చేయడాన్ని సుబ్రహ్మణ్యస్వామి తప్పు పట్టారు. 

IHG


టీటీడీ వ్యవహారంలో తప్పు మొత్తం చంద్రబాబు ప్రభుత్వందేనని, అప్పుడు ఏపీ మంత్రిగా ఉన్న బీజేపీ నాయకుడు మాణిక్యాలరావు కూడా తప్పు చేశారని, దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు ఉన్నాయని ,ఏకంగా 51 టీటీడీ స్థలాలు విక్రయానికి చంద్రబాబు అధికారంలో ఉన్న సమయంలో నియమించిన టీటీడీ పాలక వర్గం నిర్ణయం తీసుకుంది అనే విషయాన్ని కూడా సుబ్రహ్మణ్యస్వామి బయటపెట్టారు. అలాగే ఏపీ బీజేపీ నాయకులు అంతా పూర్తిగా చంద్రబాబు ట్రాప్ లో పడిపోయారని, మొత్తం అన్ని వ్యవహారాలు ఆయనే నడిపిస్తున్నారని, ఈ విషయంలో బిజెపి, జనసేన పూర్తిగా బాబు ట్రాప్ లోనే ఉన్నాయి అనే విషయాన్ని స్వామి బయటపెట్టారు. ఇదే విషయాన్ని సుబ్రహ్మణ్యస్వామి అధిష్టానం పెద్దల వద్ద కూడా ప్రస్తావించినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: