ఎన్నో పోరాటాలకు, అలుపు ఎరగని పోరాటానికి స్ఫూర్తిగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక్కరోజులో జరిగింది కాదు. అలుపు ఎరగకుండా జరిపిన ఆరు దశాబ్దాల పోరాటం చేసిన తర్వాత కానీ ఆ రాష్ట్రము ఏర్పడలేదు. ఎందరో ఉద్యమకారుల జీవితకాల ఆరాటంతో సాధించిన విజయం అది. ఎంతో మంది వలస నాయకుల అన్యాయాలను ఎదురొడ్డి నిలిచిన వీరత్వం చాటుకొని, తెలంగాణ బిడ్డల ఆత్మత్యాగం తో సాధించిన విజయం అది. మన నీళ్ల కోసం, మన నిధుల కోసం, మన నియామకాల కోసం ఉరికిన సకల జనుల సమరోత్సాహం మన తెలంగాణ. 

 

ఆత్మాభిమానంతో అవమానాలను భరించి, తెగించి తెచ్చుకున్నది మన తెలంగాణ రాష్ట్రం.ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో జూన్ 2 , 2014 న తెలంగాణ రాష్ట్రం భారతదేశ 29 వ రాష్ట్రాంగా ఆవిర్భవించింది. నేటితో సరిగా ఆరేళ్లు పూర్తయ్యాయి. ఈ ఆరు సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం ఎటు వైపు నడిచింది? రాష్ట్రంలో అభివృద్ధి తీరు ఎలా ముందుకు వెళుతోంది ...?  అని ఆలోచిస్తే ... పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతలు, కాళేశ్వరం ప్రాజెక్టు, సీతారామ మొదలగు ప్రాజెక్టులతో కళకళ లాడుతోంది రాష్ట్రం. ముఖ్యంగా రాష్ట్రంలో మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలు రాష్ట్రానికి వెన్నముక్కలా మారాయి. 


ఇకమారో వైపు, రైతు బంధుతో దేశ చరిత్రలోనే  కొత్త అధ్యాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం నంది పలికింది. కేసీఆర్ కిట్లు, ఆసరా పెన్షన్లు, రైతు బీమా, కంటి వెలుగు మొదలగు పథకాలతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోంది. అలాగే ఇక రాష్ట్ర పురోగతిలో IT పరిశ్రమలోనూ మంచి ఫలితాలు రాబడుతూ దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా మారింది. మరోవైపు పారిశ్రామిక అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలను ఏర్పాటు చేయాలనుకునేవారుకి రాయితీలతో పాటు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు ఇచ్చేందుకు TS i - pass వంటి విప్లవాత్మక విధానాలకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. దీని ఫలితంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్ మహానగరంలో పెట్టుబడులు పెట్టేందుకు అక్కడ దోహదపడింది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: