తెలంగాణ ఆవిర్భావం జరిగి ఈరోజుకు సరిగ్గా ఆరేళ్ళు పూర్తయ్యింది. ఆరేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారు. అసలు తెలంగాణ ఆవిర్భవించేందుకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 60 ఏళ్ళ పోరాటం.. 60 ఏళ్ళ కష్టంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇంకా అలాంటి రాష్ట్రం ఏర్పడ్డనాటి నుండి ఎంతో అభివృద్ధి చెందింది. 

 

IHG

 

అయితే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యతలు చేపట్టాక తొలి విజయాన్ని అందుకుంది విధ్యుత్ తోనే. తెలంగాణ ఆవిర్భవిస్తే చీకట్లు తప్పవు అని నాటి పాలకుల చేసిన హెచ్చరికలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాంటి హెచ్చరికలను తప్పని నిరూపించాడు సీఎం కేసీఆర్. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చాడు సీఎం కేసీఆర్. 

 

IHG

 

దేశంలో ఎక్కడ.. ఎప్పుడు లేని విధంగా వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను అందించారు. ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయడంతో ఆగిపోకుండా.. సోలార్, థర్మల్ విద్యుత్ ఉత్పత్తిని సైతం గణనీయంగా పెంచారు. అంతేకాదు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగినా.. ఎటువంటి ఆటంకం రాకుండా డిమాండ్‌కు సరిపడా విద్యుత్ ను సరఫరా చేశారు. 

 

IHG

 

అంతటితో ఆగలేదు.. కేటీపీఎస్‌లో 800 మెగావాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంట్‌ను నిర్మించారు.. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో భూపాలపల్లిలో మధ్యలో ఆగిన 600 మెగావాట్ల కేటీపీపీని ఏడాదిలోపే పూర్తి చేసింది తెలంగాణ సర్కార్. విద్యుత్ కోతల్లేని రాష్ట్రంగా తెలంగాణగా రాష్ట్రం అవతరించింది.                                   

మరింత సమాచారం తెలుసుకోండి: