ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రతిపక్ష పార్టీ టీడీపీ నుండి కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే చంద్రబాబు కి ఉన్న ప్రతిపక్షం కూడా పోయే అవకాశం ఉంది. ఇటీవల 'మహానాడు' జరిగిన టైములో పార్టీలో కీలక నాయకులతో చంద్రబాబు ఈ విషయం గురించి చర్చించి ఆందోళన చెందినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా పార్టీ నుండి ఎవ్వరు వెళ్ళిపోకుండా కట్టడి చేయడం కోసం చంద్రబాబు తీవ్రస్థాయిలో కసరత్తులు చేస్తున్నారు. దీనికి సంబంధించి పార్టీలో ఎవరైతే మారే విధంగా వైఖరి ఉందో వారితో చంద్రబాబు మంతనాలు జరుపుతున్నారని రాయబారాలు చేస్తున్నారని సమాచారం.

 

అయితే ఎవరు ఉంటారో ఎవరు వెళ్తారు అన్న దాని విషయంలో చంద్రబాబు క్లారిటీ రావడం లేదంట. మరోపక్క జూన్ 18 వ తారీఖున రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. రాజ్య సభలో 18 సీట్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా వాయిదా పడిన ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఐదుగురు నామినేషన్లు వేయడం జరిగింది. బల పరంగా చూసుకుంటే వైసీపీకి నాలుగు స్థానాలు రావడం ఖాయం. అయితే ఈ విషయంలో వ్యూహాత్మకంగా చంద్రబాబు వర్ల రామయ్య ని రంగంలోకి దించడం జరిగింది.

 

ఇదిలా ఉండగా టీడీపీ పార్టీలో 23 మంది ఎమ్మెల్యేలు ఉండగా ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవడం జరిగింది. దీంతో టీడీపీ బలం 20కి పడిపోయింది. తాజాగా జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ నిర్ణయం ప్రకారం ఎంత మంది ఓటు వేస్తారు అనేది తేలిపోతుంది. ఎవరైతే ఓటు వెయ్యరో పార్టీని వీడేది ఎవరో అన్న దాని విషయంలో టీడీపీలో క్లారిటీ వచ్చేస్తోంది. చంద్రబాబు ప్రతిపక్షానికి సంబంధించి క్లారిటీ రానుంది. సో జూన్ 18 వ తారీకు అనేది ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: