ప్రస్తుతం భారత దేశంలో కరోనా మహమ్మారి ఎలాంటి వివక్షలు తెచ్చిపెడుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కరోనా కు భయపడి నా పరాయ అన్న తేడా లేకుండా భౌతిక దూరం పాటించే పరిస్థితి నెలకొంది. తాజాగా ఈ కరోనాపై ఒక్కొక్కరు ఒక్కో తీరుగా స్పందించి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఈరోజు కరోనా వల్ల ఎవరూ ఎవర్ని తాకడం లేదు. ఇదే కదా మడి అంటే. మరణసయ్యపై మడికట్టుకుని ఉంది మానవజాతి. ఆ మడి కట్టుకోవడం అంటే నువ్ నా దగ్గరకు రాకు.. నేను నీ దగ్గరకు రాని అని. శాస్త్రవేత్తలు కూడా దీన్ని పాటించమని చెప్తున్నారు.. మీరూ కూడా పాటించడి అని నా పాట రూపంలో చెప్పా.. అంతరానితనం, అస్పృశ్యత, కుల వివక్షతలకు తాను వంత పాడలేదన్నారు జొన్నవిత్తుల. ఓ వైపు కరోనా గురించి భయపడకండి.. కరోనా సోకిన వారి పట్ట కనీస బాధ్యత చూపండి అంటూ ప్రభుత్వాలు చెబుతున్నాయి.  


కరోనా వచ్చిన వారి పట్ల వివక్ష చూపించడం మంచి పద్దతి కాదని చెబుతున్నారు.  ఇలాంటి సమయంలో..  జొన్నవిత్తుల అంటరానితనాన్ని ప్రేరేపించేవిధంగా పద్యం రాయడం.. తిరిగి తన పద్యాన్ని సమర్థించుకోవడంతో దళిత సంఘాలు ఆగ్రహించాయి. ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఫిర్యాదు చేయడంతో చివరికి ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.  కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటించాలని తెలియజేస్తూ... అంతరాని తనాన్ని కొనసాగించేలా ఆయన పాడిన పద్యంపై తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. మార్చి 23న ఓ టీవీ చానల్ కార్యక్రమంలో పాల్గొన్న జొన్నవిత్తుల ఎస్సీ, ఎస్టీల మనోభావాలు కించపరిచేలా ఓ పద్యం పాడారని, అంటరానితనాన్ని కొనసాగించాలనే అర్థం ఆ పద్యంలో ఉందని మాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల రాంప్రసాద్ నాంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


కాగా, బ్రాహ్మణులు తమ కుటుంబాల్లో పాటించే మడి విధానం గురించే ప్రస్తావించానంటూ తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని.. తప్పుంటే శిక్షించవచ్చు అంటూ జొన్నవిత్తుల తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు. అయితే జొన్నవిత్తుల తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని కోరారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఎస్సీ, ఎస్టీలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: