దేశాన్ని మరియు విశాఖ పట్టణ వాసులను భయాందోళనకు గురి చేసిన ఘటన విశాఖ ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన. లాక్ డౌన్ చాలా పటిష్టంగా అమలు చేస్తున్న సమయంలో ఇంటికే పరిమితమైన ప్రజలు ఈ ఘటన వల్ల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎల్జి పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటన వలన 12 మంది చనిపోగా వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. తెల్ల తెల్లవారుజామున విషవాయువు కంపెనీ నుండి రిలీజ్ కావటంతో నిద్రలో ఉన్న వారు గృహ తప్పి పడిపోయారు. పశువులు పొలాలు కూడా తీవ్రస్థాయిలో గ్యాస్ శెట్టి వల్ల నాశనం అయ్యాయి. ఇదిలా ఉండగా గాయపడిన ప్రతి ఒక్కరికి భారీ స్థాయిలో నష్ట పరిహారం ఏపీ ప్రభుత్వం చెల్లించడం అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ ఘటన ఎందుకు జరిగింది..?... ఎవరి తప్పిదం అన్నదానిపై విశ్రాంత జడ్జి శేషశయనరెడ్డి కమిటీ స్పష్టంగా తమ నివేదికలో చెప్పింది. ఏర్పాటైన ఐదుగురు సభ్యుల ఈ కమిటీలో ప్రమాదానికి మానవ తప్పిదమే కారణమని కమిటీ తన నివేదికను ఎన్‌జీటీ సంస్థకు అందించింది. కీలక విషయాలను ఇందులో ప్రస్తావించింది. మానవ తప్పిదం తోపాటు భద్రతా వైఫల్యం, సంస్థ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చెప్పింది. అంతేకాకుండా 2001 నుంచి కంపెనీ అనుమతి లేకుండా నడుస్తోందని ఈఏఎస్‌ శర్మ తరఫు న్యాయవాది చెప్తూ గ్యాస్‌ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.

IHG't have all approvals, changed mix: MoEF - The ...

జాతీయ హరిత ట్రైబ్యునల్ లో (ఎన్‌జీటీ)లో విచారణ జరిగింది. వాదనలు విన్న న్‌జీటీ ధర్మాసనం నివేదికను పరిశీలించాక లిఖిత పూర్వక ఆదేశాలు వెలువరిస్తామని స్పష్టం చేసింది. అయితే నివేదికలో వచ్చిన నిజాలు రిపోర్టు సమాచారం విని వైజాగ్ వాసులు ఉలిక్కిపడ్డారు. దాదాపు 20 సంవత్సరాలు మేము చావు తో పోరాడుతున్నాం అని నివేదిక విని వ్యాఖ్యానిస్తున్నారు. ఇటువంటి కంపెనీలు నగరంలో కాదు దేశంలో ఎక్కడా ఉండకూడదని డిమాండ్ చేస్తున్నారు. 2001 నుండి కంపెనీకి అనుమతులు లేవంటే ప్రభుత్వ వైఫల్యాలు కూడా ఉన్నట్లే కదా అని మరికొంతమంది ప్రభుత్వాలపై విమర్శలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: