జగన్ రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నాటి నుండి ఈనాడు మరియు కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా జగన్ కి వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేయడం అందరికీ తెలిసిందే. ఎప్పటికప్పుడు జగన్ కి  వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తూ వ్యవహరించే 'ఈనాడు' ఇటీవల ఒక్కసారిగా తన ప్లేట్ మార్చినట్లు వార్తలు ప్రచురించింది. జగన్ కి సపోర్ట్ చేసే విధంగా 'ఈనాడు' ఫ్రంట్ పేజీలో వార్త ప్రచురించడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. విషయంలోకి వెళితే వైయస్ జగన్ కరోనా వైరస్ గురించి మాట్లాడిన సమయంలో అప్పట్లో ఇక రానున్న రోజుల్లో భవిష్యత్తులో అందరూ కరోనా వైరస్ తో సహజీవనం చెయ్యాలని తప్పదని చెప్పటం అందరికీ తెలిసిందే.

 

జగన్ చేసిన ఈ కామెంట్లు ప్రతిపక్షాలు మరియు ఎల్లో మీడియా అప్పట్లో అవహేళన చేశాయి. ఆ తర్వాత జగన్ చేసిన కామెంట్లు మాదిరిగానే ఇన్ఫోసిస్ అధ్యక్షుడు నారాయణ మూర్తి మాట్లాడటం జరిగింది. ఆర్.బి.ఐ మాజీ గవర్నర్ రంగరాజన్ కూడా ఈ విధంగానే జగన్ అభిప్రాయాలను సమర్పించినట్లు ఆయన వ్యాఖ్యలు అప్పట్లో చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారులు కూడా ఈ విధంగానే వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తాజాగా వీటన్నిటికీ ప్రాధాన్యత ఇస్తూ 'ఈనాడు' పత్రిక జగన్ స్థాయిని పెంచే విధంగా ఫ్రంట్ పేజీలో ఆర్టికల్ రాయడం తెలుగు మీడియా వర్గాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది. జగన్ సొంత పత్రిక సాక్షి   కూడా రాయని విధంగా 'ఈనాడు' ఈ విషయంలో జగన్ కి సపోర్ట్ చేస్తూ రాయటం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 

జగన్ అధికారంలోకి వచ్చి సంక్షేమ పథకాల పేరుతో డబ్బు పంపకాలు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదు అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న సమయంలో ఈనాడు ఇటీవల రాష్ట్రంలో 9 భారీ పరిశ్రమలు జగన్ హయాంలో అంటూ ప్రచురించడం అందర్నీ ఆకర్షించింది. పరిశ్రమలకు సంబంధించిన వివరాలు తెలియజేస్తూ జగన్ సర్కార్ ఇమేజ్ పెంచే విధంగా ఈనాడు తన వార్తలు ప్రచురించింది. వైసీపీ మద్దతు దారులు కూడా ఈనాడు ప్రచురితం చేసిన వార్తలు చూసి షాక్ అవుతున్నారు. ఈనాడు ని నమ్మవచ్చా అసలు ఎందుకు ఈ విధంగా ఒక్కసారిగా మద్దతు తెలుపుతుంతోంది అన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. మరోపక్క సామాన్య పాఠకులు కూడా ఈనాడు పత్రిక ఏంటి ఈ విధంగా మారిపోయింది తెర వెనుక ఏదైనా జరిగిందా అని ఆశ్చర్యపడుతున్నారట. 

మరింత సమాచారం తెలుసుకోండి: