రోజురోజుకు కోరలు చాస్తున్న కరోనా  వైరస్ భారత దేశం పై పంజా విసురుతున్న విషయం తెలిసిందే. రోజురోజుకు లాక్ డౌన్ సడలింపు ఇస్తున్నారు కానీ... మహమ్మారి వైరస్ మాత్రం ఎక్కడా బ్రేక్ ఇవ్వడంలేదు. పరిస్థితి రోజురోజుకు భారత దేశంలో పెరిగిపోతున్న కరోనా  వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ అవుతుంది. భారత దేశంలో ఇప్పటికీ రెండు లక్షలకు చేరువలో ఉంది కరోనా వైరస్ కేసుల సంఖ్య. ఇక అధికారులు ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ కొంత మంది నిర్లక్ష్యం కారణంగా ఈ మహమ్మారి వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతూనే ఉంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా రోజు రోజుకు ఈ మహమ్మారి వైరస్ కేసుల సంఖ్య పెరిగిపోతుంది అన్న  విషయం తెలిసిందే. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో దేశ రాజధాని ఢిల్లీ కూడా  నాలుగో స్థానంలో ఉంది.

 

 

 అయితే ప్రజల్లో కేవలం కరోనా  వైరస్ కేసులు రావడమే కాదు ఏకంగా.. ప్రజలకు రక్షణ కల్పించేందుకు చర్యలు చేపడుతున్న ప్రభుత్వ అధికారులు ఆఫీసుల్లో  కూడా ప్రస్తుతం కరోనా  వైరస్ కేసులు బయటపడుతుండటం  దేశవ్యాప్తంగా సంచలనం గా మారిపోతుంది. ఇది పలు విమర్శలకు కూడా దారి తీస్తుంది.తమ  ఆఫీస్ విషయంలోనూ జాగ్రత్తగా లేని అధికారులు ప్రజలకు రక్షణ కల్పిస్తున్నారా  అనే విమర్శలకు తావిస్తోన్నాయి  ఇలాంటి ఘటనలు. ఇప్పటికే పలు రాష్ట్రాలలో ఇలా ప్రభుత్వ ఆఫీసుల్లో  కూడా కరోనా  వైరస్ కేసులు బయటపడిన ఘటనలు చాలానే జరిగాయి అనే విషయం తెలిసిందే.ఇక తాజాగా ఢిల్లీలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. 

 

 ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీలో మహమ్మారి వైరస్ విజృంభిస్తూ  కోరలు చాస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా ఏకంగా ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైసాల్  కార్యాలయంలోనే కరోనా వైరస్ కలకలం సృష్టించింది. ఏకంగా ఢిల్లీ గవర్నర్ కార్యాలయంలోనే 13 మందికి కరోనా  వైరస్ పాజిటివ్ అని నిర్థారణకు రావడం ఢిల్లీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది. సివిల్ లైన్స్ లో ఉన్న రాజ్ నివాస్ మార్గం లో పనిచేస్తున్న గవర్నర్ సిబ్బందికి ఈ మహమ్మారి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత గవర్నర్ హౌస్ స్టాప్ కి సంబంధించిన వారికి కూడా కరోనా  వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా దీనికి సంబంధించిన రిపోర్టులు  అధికారుల  చేతికి రానున్నాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ కి ఏమైనా ఈ మహమ్మారి వైరస్ ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: