కరోనా వైరస్ ఎంతోమంది పాలిట శాపంగా మారుతున్న విషయం తెలిసిందే. ఇక చిరు వ్యాపారుల పరిస్థితి మరింత అధ్వానంగా మారిపోతుంది. ప్రస్తుతం వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో కంటెంట్మెంట్ జోన్లుగా ప్రకటిస్తూ ప్రభుత్వం పూర్తిగా ఆంక్షలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఎలాంటి కార్యకలాపాలకు అనుమతించడం లేదు ప్రభుత్వాలు. ఇలా ప్రభుత్వ నిబంధనల ఎంతో మంది జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఉపాధి కరువవడంతో కనీసం కుటుంబాన్ని కూడా పోషించి పోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక్కడ లాక్ డౌన్ ఒక చిరువ్యాపారి పాలిట శాపంగా మారి పోయింది. ఆ చిరువ్యాపారి ఉంటున్న ప్రాంతంలో వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో అక్కడ పూర్తి స్థాయిలో నిబంధనలు అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆదాయం కూడా లేకుండా పోయింది. 

 


 ఈ క్రమంలోనే ఇంటి అద్దె కట్టకపోవడంతో.. అద్దె చెల్లించాలంటూ ఇంటి యజమాని ఒత్తిడి తీసుకురాగా మనస్తాపానికి గురైన  ఆత్మహత్య చేసుకుని తనువు చాలించాడు ఆ వ్యక్తి . ఈ ఘటన నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... అరండల్ పేట పరిధిలోని వెంకయ్య నగర్ లో నివాసం ఉంటున్న జాన్ బాబు కొత్తపేట ప్రాంతంలో నూడిల్స్ బండి పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు.ప్రభుత్వం లాక్ డౌన్  సందర్భంగా గత రెండు నెలల నుంచి ఎలాంటి వ్యాపారం లేదు... దీంతో ఉపాధిగా ఉన్నా నూడుల్స్ షాప్ కాస్త మూసివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇదే సమయంలో కూడా ఇంటి  చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో... అత్తారింటికి వెళ్లాలి అని అనుకున్నాడు . 

 


 ఇప్పటికే అత్తారింటికి కొంత సామాను  కూడా తరలించాడు. ఈ క్రమంలోనే  తక్షణమే ఇంటిని ఖాళీ చేయాలని యజమాని నోటికొచ్చినట్లు గా తీవ్రంగా దూషించడంతో  తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు జాన్ బాబు. ఉదయాన్నే భార్యను తీసుకుని అత్తారింట్లో వదిలిపెట్టి వచ్చి ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి యజమాని వేధింపులతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టాడు. ఇంటి యజమాని సహా అతని కుటుంబ సభ్యులందరూ అద్దె  చెల్లించాలంటూ తీవ్రంగా దూషించారని... అందుకే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ లో రాసాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: