మీరంతా అసమర్ధులు..మీ చేతగానితనం వల్లే ఈ స్థాయిలో ఆందోళనలు జరుగుతున్నాయి. మీరు బలాన్ని ప్రయోగించండి... నిరసనకారుల అంతు చూడండి. ఇలా ఎవరు మాట్లాడగలరు...అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్ప... జాత్యహంకార దాడికి నిరసనగా జరుగుతున్న ఆందోళనలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ట్రంప్.. రాష్ట్రాల గవర్నర్లను తిట్టిపోశారు. అంతా మీరే చేశారంటూ వాళ్లపై విరుచుకుపడ్డారు.

 

ఓ పోలీసు అధికారి చేసిన అనాగరిక చర్యకు దేశమంతా తగలబడుతుంటే... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మాత్రం ఆందోళనకారులు ఆవేదన అర్ధం కావడం లేదు. సాధారణంగా ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు ప్రభుత్వాలు సంయమనంతో వ్యవహరిస్తాయి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్న భరోనాను కల్పించే ప్రయత్నం చేస్తాయి.

 

కానీ ట్రంప్ తీరు అందరికంటే భిన్నం. ఆయనొక మోనార్క్... ఆయన చెప్పింది అందరూ వినాల్సిందే తప్ప... ఇతరులు చెప్పేది తలకెక్కించుకునే అలవాటు ఆయనకు లేదు. జార్జ్ ఫ్లాయిడ్ ఎపిసోడ్‌లోనూ ట్రంప్ ఇదే తరహాలో స్పందించారు.

 

రాష్ట్రాల గవర్నలతో  వీడియో, టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన ట్రంప్...వాళ్లందరూ అసమర్ధులని తేల్చిపడేశారు. ఆందోళనలు చెలరేగిన వెంటనే గవర్నర్లను వాళ్లపై ఉక్కుపాదం మోపి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదంటూ క్లాస్ తీసుకున్నారు. ట్రంప్ అక్కడితో ఆగలేదు.. ఇలాంటి పరిస్థితుల్లో గవర్నర్లు డామినేటింగ్‌గా ఉండాలంటూ హుకుం జారీ చేశారు. నిరసనకు దిగిన వాళ్లను అరెస్ట్ చేసి జైళ్లకు పంపాలంటూ ఆదేశించారు. జార్జ్ ఫ్లాయిడ్ చనిపోయిన తర్వాత దేశం మొత్తం ఇలా తగలబడిపోవడానికి గవర్నర్ల అసమర్ధతే కారణమంటూ వాళ్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్రంప్. 

 

ఆందోళనలు విజయవంతంగా జరుగుతున్నాయంటే...మీ అసమర్ధత వల్లే...మీలో చాల మంది నిజంగానే అసమర్ధులు అంటూ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మిన్నియాపోలిస్‌లో పోలీస్ స్టేషన్‌ను తలబడుతుంటే... యావత్ ప్రభుత్వం మన చేతగాని తనాన్ని చూసి నవ్వుతుంది అంటూ ట్రంప్ గవర్నలపై ఫైర్ అయ్యారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: