ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి యేడాది పాల‌నా కాలంలోనే ఎన్నో సంచ‌ల‌నాల‌తో ముందుకు దూసుకు వెళుతున్నారు. రాష్ట్రం తీవ్ర‌మైన లోటులో ఉన్నా ఇచ్చిన మాట ఎక్క‌డా త‌ప్ప‌కుండా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే యేడాది పాల‌నా కాలంలో మేనిఫెస్టోలో చెప్ప‌ని 40 హామీల‌ను కూడా అమ‌లు చేసిన ఘ‌న‌త‌ను వైఎస్ . జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంతం చేసుకున్నారు. ఓ వైపు ప్ర‌తిప‌క్షాలు ఎంత అరిచీ గీపెడుతున్నా కూడా జ‌గ‌న్ ప్ర‌జాదార‌ణ యేడాది కాలంలో ఎంత మాత్రం చెక్కు చెద‌ర్లేదు స‌రిక‌దా.. మ‌రింత పెరిగింద‌ని తాజా స‌ర్వేలు చెపుతున్నాయి.

 

తాజాగా అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌కు చోటు దక్కింది.  సీ-ఓటర్స్ నిర్వహించిన సర్వేలో దేశంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో వైఎస్ జగన్ నాలుగో స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో ఒడిశా సీఎం నవీన్ ప‌ట్నాయ‌క్ తొలి స్థానంలో నిలిచారు. న‌వీన్‌కు ఏకంగా  82. 96 శాతం మంది మద్దతుగా నిలిచారు. రెండో స్థానంలో చత్తీస్‌ఘడ్ ముఖ్యమంత్రి భుపేష్‌ , మూడో స్థానంలో కేరళ సీఎం విజయన్ ఉన్నారు. విజయన్‌కు 80. 06 శాతం మంది మద్దతు లభించింది.

 

ఇక నాలుగో స్థానంలో జ‌గ‌న్‌కు 78.01 శాతం మంది మ‌ద్ద‌తు తెలిపారు. ఇదే జాబితాలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరో స్థానంలో ఉన్నారు. ఇక చివ‌రి స్థానంలో హ‌ర్యానా సీఎం మనోహర్ లాల్ కట్టర్ ఉండ‌గా... ఆయ‌న‌కు కేవలం 4.47 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. ఇక కేసీఆర్‌కు 54. 22 శాతం మంది ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మోడీ మ‌రోసారి ప‌వ‌ర్ ఫుల్ పీఎంగా నిలిచారు. 66.2 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. రాహుల్‌ గాంధీ నాయకత్వానికి 23. 21 శాతం మంది మాత్రమే మద్దతు తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: