లాక్‌డౌన్‌ కారణంగా వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్నవారి తరలింపు 'శ్రామిక్‌ స్పెషల్‌ రైళ్ల'ను నడుపుతున్న రైల్వే మంత్రిత్వ శాఖ వలస కూలీలు, యాత్రికులు, సందర్శకులు, విద్యార్థులు, ఇతరుల తరలిస్తున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని చోట్ల శ్రామిక్ రైళ్ల వద్ద వలస కూలీలు  చాలా అవమానాలు ఎదుర్కొంటున్నారు. తాజాగా శ్రామిక్ రైల్లో స్వస్థలానికి బయల్దేరిన వలస కూలీ టాయిలెట్‌లో కన్నుమూశాడు. నాలుగు రోజుల పాటు మృతదేహంలో అందులోనే ఉండిపోయింది. కుళ్లిన వాసన రావడంతో విషయం బయటికొచ్చింది. అయితే ఇది అప్పటి వరకు ఎవరూ గమనించకపోవడం ఇక్కడ అందరికీ షాక్ కి గురి చేసింది. ఈ దారుణ ఉత్తరప్రదేశ్‌లో ఈ చోటు చేసుకుంది.  గత రెండు నెలల నుంచి వలస కూలీలు రక రకాల పద్దతుల్లో తమ స్వస్థలం వెళ్తన్నారు. 

 

ఈ క్రమంలోనే ఎన్నోకష్టాలు పడుతున్నారు. కొన్ని చోట్ల అధికారులచే ఛీత్కరింపబడుతున్నారు.  అయినా తమ గమ్య స్థానం చేరుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు.  బస్తీ జిల్లాకు మోహన్‌లాల్ శర్మ ముంబైలో కారు డ్రైవర్ గా పనిచేసేవాడు. లాక్డౌన్ వల్ల ఉపాధి పోవడంతో స్వస్థలానికి బయల్దేరాడు. యూపీ చేరుకున్న ఆయన గత నెల 23న ఝాన్సీ నుంచి గోరఖ్‌పూర్‌కు వెళ్లే శ్రామిక్ స్పెషల్ రైల్లో వెళ్లాడు. టాయిలెట్ వెళ్లిన ఆయన అక్కడే చనిపోయినట్లు భావిస్తున్నారు.

 

కాగా, రైల్వే పారిశుధ్య సిబ్బంది బోగీలను శుభ్రం చేస్తున్నప్పుడు విషయం బయటపడింది. టాయిలెట్‌కు బయటివైపు నుంచి కూడా గడియపెట్టి ఉందని, శర్మ వద్ద రూ. 27వేల నగదు కనిపించిందని రైల్వే అధికారులు చెప్పారు. రైలు రెండు రోజులు ఆలస్యమైందని, తాను భర్తకకు ఫోన్ చేస్తే స్విచాఫ్ అని వచ్చిందని శర్మ భార్య చెప్పారు. అయితే గత కొన్ని రోజులుగా శ్రామిక్ రైళ్లలో ఇంతవరకు 80 మంది చనిపోయారు. కొందరు అనారోగ్యంతో, కొందరు తిండి లేక చనిపోయనట్ల వార్తలు వస్తున్నాయి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: