ప్రస్తుతం అమెరికాలో పరిస్థితులు ఎటు నుండి ఎక్కడికి  దారితీస్తుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. జాత్యహంకారం అనే ఒక రోగం అమెరికా మొత్తం వ్యాపించి ఉంది అని ప్రస్తుతం అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారి తీస్తుంది. వాస్తవంగా అయితే ప్రపంచంలోని అన్ని దేశాలకు చెందిన పౌరులు అమెరికాలో ఉపాధి పొందుతున్నారు. అయితే గతంలో అమెరికా ఫస్ట్ అనే ఒక భావోద్వేగంతో గెలిచారు ట్రంప్  అనే విషయం తెలిసిందే.. కాబట్టి ఈసారి ట్రంప్  ని దెబ్బ కొట్టాలి అంటే.. నల్ల జాతీయులు తెల్లజాతీయులు అంటూ అమెరికా లో విభేదాలు  తీసుకురావాలి.. అందులో భాగంగానే ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసాలు అని.. ఇవి  అత్యంత ప్రమాదకరమైనవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 


 అయితే వాస్తవంగా ఇప్పుడు కీలకమైన అంశం ఏమిటంటే భారత్కు సంబంధించిన ఎంతో మంది ప్రస్తుత అమెరికా దేశం వెళ్లి అక్కడ ఉపాధి పొందుతున్న విషయం తెలిసిందే. కేవలం ఉద్యోగాలు ఉపాధి పొందడానికి మాత్రమే కాకుండా చదువుకోవడానికి కూడా చాలా మంది భారత్ నుంచి అమెరికాకు వెళ్లారు. మామూలుగానే అమెరికాలో ప్రస్తుతం కరోనా  కష్టకాలం ఉన్న విషయం తెలిసిందే. దీంతో కరోనా  కష్టకాలంలో ఇన్ని రోజుల వరకు బయటి తిరగడానికి ఎక్కడ వీలులేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే ఉద్యోగానికి బయల్దేరుతున్నారు. అదేసమయంలో ప్రస్తుతం అమెరికాలో జాత్యహంకారం అనే పేరుతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎక్కడికక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎవరిపై  ఎవరు దాడులకు దిగుతున్నారు అన్నది  కూడా అర్థం కాని పరిస్థితి. 

 

 

 ఇలాంటి సమయంలో భారత్కు చెందిన ఎన్ఆర్ఐలు కాస్త ఇలాంటి వ్యవహారంలోకి తలదూర్చకుండా  ఉంటే బాగుంటుంది అని విశ్లేషకులు  అభిప్రాయపడుతున్నారు.ఈ  సందర్భంలో సదరు ఉద్రిక్త పరిస్థితుల్లో తలదూర్చకుండా  రాత్రి సమయంలో ఎక్కువగా బయటకు రాకుండా ఉంటే మంచిది అంటున్నారు విశ్లేషకులు. ఇది జాతి వివాదమా..  జాతీయ వివాదమ లేకపోతే ఏదైనా కుట్ర  అనే విషయం పక్కన పెడితే.. మనది కాని దేశంలో  ఉపాధి కోసం వెళ్లాము  కాబట్టి ఇలాంటి వాటిలో మీరు వేలు పెట్టి సరికొత్త సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే సైలెంట్గా ఉంటు  వాక్ స్వాతంత్రాన్ని ఉపయోగించుకోకపోవడమే  మంచిది అని చెబుతున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: