ప్రస్తుతం దేశంలో కరోనా  వైరస్ విజృంభిస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం కరోనా కేసులు  పెరుగుతున్నప్పటికీ భారీ మొత్తంలో సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కేవలం 10 శాతం మాత్రమే లాక్ డౌన్   కొనసాగుతుండగా 90% సడలింపు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలో మరిన్ని కేసులు ఎక్కువవుతున్నాయి విషయం తెలిసిందే. ఇక త్వరలో అన్లాక్ అయితే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ప్రభుత్వాలు ఎలా సంసిద్ధంగా ఉండాలి అని సర్వత్రా చర్చనీయాంశంగా మారిపోయింది . దేశవ్యాప్తంగా అన్లాక్ అయిన తర్వాత... రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి పరిస్థితులు ఏర్పడిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అంటున్నారు విశ్లేషకులు. 

 


 దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ వాళ్లంతట వాళ్లే టెస్టులు చేయించుకునేందుకు అనుగుణంగా వైరస్ నిర్ధారిత పరీక్షలకు సంబంధించిన సెంటర్లను ఓపెన్ చేయాలి.  సెంటర్ లు  అన్నింటిలో కంపల్సరిగా పీపీఈలు మెయింటెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక వేగంగా టెస్టులు రిపోర్టులు కూడా వేగంగా వచ్చేలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఉంది. అంతే కాకుండా దేశవ్యాప్తంగా క్వారంటైన్ సెంటర్లు పెద్ద ఎత్తున పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటున్నారు. మరో విషయం ఏమిటంటే ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం అయిపోయింది. ఇప్పటికే కేరళ వరకు ఋతుపవనాలు రాగా  అటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తేలికపాటి వర్షాలు అక్కడెక్కడ కురుస్తున్నాయి. 

 


 వర్షాకాలం అంటే మహమ్మారి వైరస్ మరింతగా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలం వచ్చింది అంటే ఆస్మా షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఇబ్బంది పడతారు అనే విషయం తెలిసిందే. ఇలాంటి వారికి గాలి తీసుకోవడానికి ఎక్కువగా సమస్య ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో వెంటిలేటర్ లను  పెద్ద ఎత్తున ఆయా రాష్ట్రాల సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అని అంటున్నారు. ఇక ఆస్పత్రిలను  అన్నింటిని సిద్ధంగా ఉంచుకోవాలని అంటున్నారు. ఎందుకంటే ఒక్కసారి అన్ లాక్ చేసిన తర్వాత ఎవరి నుంచి ఎవరికీ ఈ మహమ్మారి వైరస్ పాకుతుంది అన్నది మాత్రం తెలియకుండా ఉంటుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు మరింత అప్రమత్తంగా ఉండి ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: