దేశంలో గత రెండు నెలల కు పైగా కరోనా కష్టాలు పడుతున్న విషయం తెలిసిందే. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు లాక్ డౌన్ పాటిస్తూ ఇంటి పట్టున ఉన్నారు. ప్రస్తుతం లాక్ డౌన్ సడలించిన వేళ జనాలు బయటకు వస్తున్నారు. కానీ భౌతిక దూరం ఉడాలి.. మాస్క్ తప్పని సరి వాడాలి.. శానిటైజర్ తో ఎప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.. ఇలాంటి నియమాలు పాటించాలని ప్రభుత్వం చెబుతూనే ఉంది. కానీ ఇవి మాత్రం.. కర్ణాటకలో కొంత మంది నేతలకు అస్సలు పట్టనట్టు ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి శ్రీ రాములు చేసిన నిర్వాకమే ఇందుకు నిదర్శనం. కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లో బాధ్యతగా ఉండాల్సిన ఆరోగ్య మంత్రి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారు. చిత్రదుర్గలో ఈ రోజు ఓ ఊరేగింపులో ఆయన పాల్గొన్నారు. 

 

కర్నాటక ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు సపోర్టర్లు.. అసలు భౌతిక దూరం రూల్ ఒకటుందనే విషయమే మరిచినట్టున్నారు. ఆయన ఓపెన్ ట్రక్కులో ప్రయాణిస్తుండగా.. వందలకొద్దీ అభిమానులు, మద్దతుదారులు పొలోమంటూ ఆ వాహనంవెంట బడ్డారు.  ఈ కార్యక్రమంలో ఎవ్వరూ భౌతిక దూరం పాటించలేదు, మాస్క్ ధరించలేదు. ఆరోగ్యశాఖా మంత్రి నిలబడి ఉన్న వాహనం చుట్టూ ఎలాంటి నిబంధనలు పాటించకుండా పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు.

 

బత్తాయిలు, ఆపిల్ పండ్లతో చేసిన గజమాలతో మంత్రిగారిని సత్కరించారు. పూలు చల్లుతూ, నినాదాలు చేస్తూ.. గుంపులు..గుంపులుగా… తమ ‘స్వామి భక్తి’ని చాటుకునేందుకు ‘సోషల్ డిస్టెన్స్’ ని ‘అపహాస్యం’ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంత్రిగారి  నిర్వాకం పట్ల నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: