ఓ కిలాడీ లేడీ... పెళ్లి పేరుతో అమాయక యువకులను మోసం చేస్తూ కోట్ల రూపాయలను కొల్లగొడుతుంది. పెళ్లి పేరుతో అమాయక యువకులను మోసం చేసి వారిని వేధించి ఓ మహిళ ఉదంతం పై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు చేశారు. ఆమెకు ఆర్థికంగా సహాయం చేస్తే తనను పెళ్లి చేసుకుంటానని ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ను నమ్మించి అతనితో ఏకంగా కోటి రూపాయలు లాగేసి కనిపించకుండా పోయింది.

 


ఇక అసలు విషయంలోకి వెళితే... హైదరాబాద్ నగరంలోని వసంత నగర్ కు చెందిన చైతన్య విహారి అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్యక్తిని ఇటీవల ఒక తెలుగు మ్యాట్రిమోనీ సైట్ లో అనుపల్లవి అనే పేరుతో ఓ మహిళ పరిచయం చేసుకుంది. ఆ మహిళ తాను డాక్టర్ అని జూబ్లీహిల్స్ లో ఉంటాను అని చెప్పుకొచ్చింది. ఇలా కొద్ది రోజులు వారు చాటింగ్ చేస్తూ ఉండగా కొద్ది రోజులకు ఆమె కొత్త నాటకానికి తెర లేపింది. తనకు రావాల్సిన ఆస్తులను కుటుంబ సభ్యులు అడ్డుకుంటున్నారని లీగల్ సమస్య పరిష్కారానికి తనకి సహాయం చేయమని దాదాపు కోటి రూపాయలను కాజేసింది ఆ కిలాడి లేడి.

 


ఆ మాటలు నమ్మిన చైతన్య ఆమె చెప్పిన బ్యాంక్ అకౌంట్ కి ఏకంగా ఒక కోటి రెండు వేల రూపాయలను ట్రాన్స్ఫర్ చేశాడు. ఇక అంతే ఆ తర్వాత అందుబాటులో లేకుండా పోయింది. అప్పుడు కాని సదరు వ్యక్తికి అర్థం కాలేదు తను మోసపోయానని. ఆ తర్వాత ఆ విషయాన్ని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు. ఇలా కేసును పరిశీలించిన సైబర్ క్రైమ్ పోలీసులు ఆమెను వెతికే క్రమంలో అనేకమంది ఎన్నారైలను కూడా మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇలాంటి కేసుకు సంబంధించి గత వారం రోజుల కిందట జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒకరిని అరెస్టు చేశారు. జల్సాలకు అలవాటు పడిన ఆమె ఇలాంటి మోసాలకు పాల్పడుతూ ఉందని ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం కూడా ఉందని పోలీసుల విచారణలో తేలింది.

మరింత సమాచారం తెలుసుకోండి: