దేశంలో ప్రజలు కరోనా కష్టాలు పడుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఇప్పటికీ ఐభై రోజులకు ఎక్కువగానే ఈ కరోనా మహమ్మారితో ఫైట్ చేస్తూనే ఉన్నారు... అయినా ప్రతిరోజూ కేసులు, మరణాలు పెరిగిపోతూనే ఉన్నాయి. కరోనా వల్ల ఎక్కువగా నష్టపోయింది వలస జీవులు.  తనకు ఉపాది దొరుకుతుందని వివిధ రాష్ట్రాలకు వెళ్లిన పేద వలస కార్మికులు దాదాపు నలభై రోజుల పాటు తమకు తెలియని ప్రదేశాల్లో చిక్కుకు పోయారు.. ఆ సమయంలో కొంత సహాయం అందినా.. అది వారి పూర్తి ఆకలి తీర్చలేని పరిస్థితి. అయితే వలస కార్మికులు తమ స్వస్థలాలకు వెళ్తున్న విషయం తెలిసిందే.  ఇందుకోసం శ్రామిక్ రైళ్లు, బస్సులు ఏర్పాటు చేశారు. ఇక ఉత్తర ప్రదేశ్ కు లక్షల మంది వలస కార్మికులు స్వస్థలాలకు చేరుకున్న విషయం తెలిసిందే.

 

అయితే వారిందరిని క్వారంటైన్ కి తరలించి.. ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా పేద ప్రజలు ఉపాధి కోల్పోయి ఎన్నో అవస్థలు పడుతోన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో వారిని ఆదుకోవడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి ముందుకు వచ్చారు. లాక్ డౌన్ కారణంగా నిరాశ్రయులైన ప్రతి వ్యక్తికి ఆహార ధాన్యాల కొనుగోలు నిమిత్తం రూ. 1000 అందజేయనున్నట్లు ఈరోజు ప్రకటించారు. ఈరోజు సీఎం యోగి నేతృత్వంలో జరిగిన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

 

రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించొద్దని ఈ సందర్భంగా యోగి అన్నారు. అలాగే జబ్బుపడితే రూ. 2 వేలు, దురదృష్టవశాత్తు కుటుంబంలోని వారు ఎవరైనా మరణిస్తే అంత్యక్రియల నిమిత్తం రూ. 5 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇక యూపీలో కరోనా విషయానికి వస్తే.. ఇప్పటివరకు 8,075 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం 3,015 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి 4,813 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మహమ్మారి కారణంగా ఇప్పటివరకు 217 మంది మరణించారు.

 


 

మరింత సమాచారం తెలుసుకోండి: