ప్రపంచంలో దేశానికి సంబంధించిన విషయాల గురించి దేశ ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉంటాయి. మన దేశం విషయానికి వస్తే 3 నుంచి 5 శాతం మంది దేశం కంటే వ్యక్తిగత అభిప్రాయాలకే ప్రాధాన్యత ఇస్తున్నారని... 20 - 25 మంది దేశం గురించి పెద్దగా పట్టించుకోరని... మిగిలిన 70 శాతం మంది మాత్రం దేశం బాగుండాలని కోరుకుంటూ దేశభక్తి కలిగి ఉన్నారని ఒక అంచనా. ఈ 3 నుంచి 5 శాతం మంది దేశం గురించి ఎక్కువగా వ్యతిరేక కోణంలోనే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ల వల్లే దేశానికి నష్టం జరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
చైనా భారత్ మధ్య ఈ సరిహద్దు వివాదాలు నెలకొనడానికి అసలు కారణం ఒక దేశంపై మరో దేశం ఆధిపత్యం చెలాయించాలని అనుకోవడమే. ఈ సరిహద్దుకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని భారత సైనికుల్లో అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యతిరేక కోణంలో ఆలోచిస్తున్న 5 శాతం తరహాలోనే స్వాతంత్రం వచ్చిన కొత్తలో బెలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ మన దేశంతో కలుస్తామన్నా మనం అంగీకరించలేదు. అందువల్లే ఆ దేశాల్లో కొన్ని మనల్ని శత్రు దేశంగా భావిస్తున్నాయి. 
 
ప్రస్తుతం దేశంలో కొన్ని గజాల భూమి గురించి కొట్టుకుని ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి నెలకొంది. ఇదే విధంగా కశ్మీర్ సరిహద్దులో, చైనా భారత్ సరిహద్దుల్లో వివాదాలు ఎందుకు జరుగుతాయంటే ఆధిపత్యం కోసం మాత్రమే. ఏదైనా యుద్ధం జరిగితే శత్రువు గురించి అన్నీ మనకు తెలియాలని మన గురించి శత్రువులకు ఏమీ తెలియకూడదని అందరూ భావిస్తూ ఉంటారు. ఒక సైనికుడు సరిహద్దు గురించి మాట్లాడుతూ సరిహద్దులో రోడ్లన్నీ రాళ్లపైనే నడిచేలా ఉంటాయని.... ఆ సరిహద్దులోని రోడ్డుపై నుంచి చైనా సైనికుల కదలికలన్నీ కనిపిస్తాయని చెబుతున్నాడు. 
 
ప్రస్తుతం చైనా మనం చైనా కదలికలను కనిపెట్టే భూభాగాన్ని ఆక్రమించటానికి ప్రయత్నిస్తోందని... గతంలో చైనాతో యుద్ధంలో జరిగిన సమయంలో మనం చైనాపై పై చేయి సాధించడానికి ఇదే కారణమని సైనికుడు చెప్పాడు. అందువల్లే ఈ భూభాగం విషయంలో మోదీ అంత పట్టుదలగా ఉన్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఆ భూభాగం మనతోనే ఉంటే మాతమే చైనాపై ఆధిపత్యం చెలాయించగలమని భావిస్తూ ఈ సరిహద్దు విషయంలో కేంద్రం యుద్ధానికైనా సిద్ధం అనేలా వ్యవహరిస్తోందని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: