కరెక్ట్ టైమ్‌లో కరెక్ట్‌గా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడంలో జగన్‌కు సాటి ఎవ్వరూ లేరనే చెప్పొచ్చు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజలకు ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటూ వస్తున్నారు. అధికారంలోకి రాకమునుపు ఏమైతే హామీలు ఇచ్చారో, అవే హామీలని అధికారంలోకి వచ్చాక, మాట తప్పకుండా సమయానికి అమలు చేసి చూపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రతి సంక్షేమ పథకం అమలులో అదే చేశారు.

 

ఆఖరికి కరోనా వల్ల లాక్ డౌన్ ఉన్నా సరే ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఆర్ధిక పరిస్తితి బాగోకపోయినా సరే లాక్ డౌన్ సమయంలో పథకాలు అందించారు. సున్నా వడ్డీ, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, రైతు భరోసా, ఆటో కార్మికులకు 10 వేలు, కాపు మహిళలకు 15 వేలు..తాజాగా గత ఏడాది మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ మరో రూ.250 పెంచి, మొత్తం 2500 పెన్షన్ ఇచ్చారు.

 

ఇక త్వరలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేసి, ఇళ్ళు కట్టించి ఇవ్వనున్నారు. ఈ క్రమంలోనే జగన్ మరొక మంచి నిర్ణయం ఒకటి తీసుకున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ కింద, పేదలకు ఇళ్ళు కట్టే కార్యక్రమం చేశారు. అయితే అధికారం మారిపోయాక, చాలా బిల్లులు పెండింగ్ లో పడిపోయాయి. దీంతో కొందరు పేద ప్రజలు అప్పులు చేసి ఇళ్ళు నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటే, కొందరు అలాగే మధ్యలోనే ఆపేశారు.

 

అయితే వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జగన్ ప్రభుత్వం కరెక్ట్ టైమ్ లో మంచి నిర్ణయం తీసుకుంది. 3,38,144 ఇళ్లకు గానూ రూ.1,323 కోట్లు చెల్లించాలని జగన్ ఆదేశాలు జారీ చేశారు. గత ప్రభుత్వం బకాయిపెట్టినా, పేదలకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఉద్దేశంతో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రజలకు ఊహించని విధంగా పథకాలు అందిస్తూ… చంద్రబాబు వదిలేసిన బకాయిలని కూడా చెల్లిస్తూ జగన్ మంచి మనసున్న సీఎం అనిపించుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: