జగన్ మీద విమర్శలు చేయడంలో టీడీపీ నేతలు అస్సలు తగ్గడం లేదు. జగన్ సీఎం అయిన దగ్గర నుంచి చంద్రబాబుతో సహ మిగిలిన టీడీపీ నేతలు ఏదొకరకంగా విమర్శలు, ఆరోపణలు చేస్తూనే ఉంటున్నారు. అయితే జగన్ మీద ప్రతిరోజూ విమర్శలు చేసే నేత ఎవరైనా ఉన్నారంటే అది టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమానే. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, గత చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఉమా, 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

 

అయితే ఓటమి పాలవ్వడం వల్ల అనుకుంటా ఉమా బాగా ఖాళీగా ఉన్నట్లున్నారు. అందుకే జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుని ముందుకెళుతున్నారు. అస్సలు గ్యాప్ ఇవ్వకుండా రోజూ ప్రెస్ మీట్ పెట్టడం ఏదొక విమర్శ చేస్తూనే ఉంటున్నారు. అలాగే పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా సవాళ్ళు విసురుతూ, మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌పై విరుచుకుపడుతున్నారు. అయితే ఇక్కడ ఉమా ఎంత కష్టపడిన పెద్దగా హైలైట్ కావడం లేదు.

 

సాధారణంగా చంద్రబాబు చేసే విమర్శలనే జగన్ పట్టించుకోరు, అలాంటిది ఉమా విమర్శలు ఆయన వరకు వెళ్ళడం కష్టం. ఆఖరికి కింది స్థాయి వైసీపీ నేతలు కూడా ఉమాకు కౌంటర్లు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మరీ తీవ్ర విమర్శలు చేసినప్పుడే స్పందిస్తున్నారు. అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఉమాని సొంత పార్టీ నేతలే పట్టించుకోవడం లేదు.

 

ఎప్పుడు కృష్ణా జిల్లాలో ఉమా పెత్తనం కొనసాగేది. కానీ ఉమా ఓడిపోయాక మిగతా టీడీపీ నేతలు ఆయన్ని పట్టించుకోవడం లేదు. ఆయన మీడియా సమావేశం పెడితే వెనుక ఎవరు ఉండటం లేదు. ఇన్నేళ్లు ఉమా పెత్తనం మీద విసుగెత్తి తెలుగు తమ్ముళ్ళు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. పైగా ఉమా కూడా మైలవరం నియోజకవర్గం వరకే పరిమితమై ఉంటున్నారు. మొత్తానికైతే జగన్ ప్రభుత్వం మీద ఉమా ఎన్ని విమర్శలు చేసిన బూడిదలో పోసిన పన్నీరే అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: