ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ మహమ్మారి వైరస్కు వ్యాక్సిన్ కనుగొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని దేశాలలో ఈ మహమ్మారి వైరస్ కు సంబంధించిన వ్యాక్సిన్ తయారీ తుది దశలో ఉందని కొన్ని దేశాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం వివిధ దేశాలకు చెందిన మేధావుల  మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఇక  మేధావుల మధ్య జరుగుతున్న ఘర్షణ కారణంగా నిజాలు అర్థం కాకుండా పోతున్నాయి . ఇక తాజాగా ఇటలీ కి సంబంధించినటువంటి ఒక పరిశోధకుడికి చైనా కు సంబంధించిన ఒక పరిశోధకుడి మధ్య వాదన జరిగింది. 

 


 ఈ రెండు నెలల కాలంలో కరోనా  వైరస్ ముందు ఉన్నంతగా బలంగా లేదని ఎంతగానో బలహీనపడింది అని ప్రస్తుతం కరోనా  వైరస్ సోకితే మరణించే ప్రమాదం తక్కువగా ఉన్నదని.. ఇటలీలో సీనియర్ వైద్యుడు వ్యాఖ్యలు చేశారు. మిలన్ లోనే సండ్రఫెల్ ఆసుపత్రికి హెడ్ అయినటువంటి ఆల్బర్ట్ జెంగ్రిలో రెండు నెలల క్రితం  పోలిస్తే ప్రస్తుతం కరోనా  వైరస్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది అంటూ వాదన  వినిపించారు. ఆయన పరిశోధనలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. కానీ నిపుణులు మాత్రం రెండోదశ వైరస్ వ్యాధి విషయంలో కొంత ఆందోళన చెందుతున్నారు అనే వాదన వినిపిస్తున్నారు ఆయన. 

 


 ప్రజలు ప్రభుత్వం మార్గదర్శకాలను పాటించి జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక వైరస్ బలహీనపడింది అన్నటువంటి ఈ నిపుణుడు వ్యాఖ్యలను జెనీవాలోని ఓ ఆసుపత్రి ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ క్లినిక్ హెడ్ ఖండిస్తున్నారు. వైరస్ బలం తగ్గి పోయింది అన్న వాదనలో నిజం లేదని...గత రెండు నెలల క్రితం కంటే వైరస్ మరింత  బలంగా మారిందని సరికొత్త వాదన వినిపించారు. ఇటు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా దీనిని ఖండిస్తోంది. అయితే వైరస్ తీవ్రత పెరిగిన తగ్గిందా అనేది పక్కన పెడితే రోజురోజుకు కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నది . ప్రపంచవ్యాప్తంగా మరణాల సంఖ్య తగ్గి రికవరీ రేటు పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: