ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ వెలుగు వెలిగిన టీడీపీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అటు తెలంగాణలోనూ ఇటు ఆంధ్రలోనూ పార్టీ పరిస్థితి మరి దారుణంగా దిగజారిపోయింది. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు పరిమితం కావడంతో 2014 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో చాలావరకు కనుమరుగైపోయింది. ఇక ఆంధ్రాలో అధికారంలో ఉంది కదా అని అనుకుంటే 2019 ఎన్నికల్లో భయంకరమైన పరాజయం మూటకట్టుకుంది టీడీపీ. ఇదిలా ఉండగా పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు టీడీపీ కి పునర్ వైభవం రావాలంటే జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని ఎప్పటి నుండో వ్యాఖ్యలు చేస్తున్నారు.

IHG

అయితే ఇదే విషయంపై బాలయ్య బాబు ఇటీవల ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. యాంకర్ తారక్ రాజకీయా ఎంట్రీ గురించి మీ స్పందన ఏమిటి అని ప్రశ్నించగా..“రాజకీయాల్లోకి రావడం, రాకపోవడం వాడి ఇష్టం” అంటూ స్పందించారు. ఈ విషయంపై మరింత క్లార్టీ ఇచ్చిన బాలయ్య… “తారక్ కు సినిమా భవిష్యత్తు చాలా ఉంది. పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం. సినిమాల్ని వదిలేసి రమ్మని అడగలేం కదా. నేను కూడా సినిమాలు చేస్తూనే రాజకీయాల్లోకి వచ్చాను.

IHG

నాన్నగారు కూడా ఒకపక్క ముఖ్యమంత్రిగా ఉంటూనే మరోపక్క సినిమాలు చేశారు. సినిమాలు వదిలేసి పాలిటిక్స్ లోకి రావాలా వద్దా అనేది వాడి ఇష్టం.” అంటూ ముగించారు. దీంతో నందమూరి ఫాన్స్ బాలయ్య బాబు వ్యాఖ్యలు విని ఒక పక్క సినిమాలు చేస్తూనే మరోపక్క పార్టీకి  కూడా ఉపయోగపడవచ్చు అన్నట్టుగా చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ పార్టీ లోకి వచ్చి బాలయ్య బాబు తో చేతులు కలిపి పార్టీ కోసం పని చేస్తే భవిష్యత్తు మొత్తం టీడీపీ దే అని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: