అందరూ అనుకుంటున్నదే. అందరూ ఊహించినదే. వర్తమాన రాజకీయాల్లో ఇది సర్వసాధారణమైనదే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ పార్టీని వెన్నటి ఉంటూ గోడ దూకేందుకు రెడీగా జంపింగ్ చేసేందుకు రెడీగా ఉంటారు ఇపుదు వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి సహజంగా టీదడీపీ నుంచి ఆ వైపునకు గోడ దూకుళ్ళు ఎక్కువైపోతున్నాయి.

 

నిజానికి జగన్ ఢిల్లీ టూర్ 2న ఉంటే ఆ తరువాత కొంత ఆగి ఈ చేరికలు జరిగేవట. కానీ ఢిల్లీ టూర్ రద్దు కావడంతో ఈ నెల 5న మంత్రివర్గం సమావేశం ఉంటుంది. ఆ తరువాత జగన్ ఢిల్లీకి మళ్ళీ ఎపుడు వెళ్తారన్నది చూడాలి. ఈలోగా ఆలస్యం ఎందుకు అని పచ్చ నేతల చేరికకు పచ్చ జెండా ఊపారని అంటున్నారు.

 

ఇప్పటిదాకా ఏపీలో కొందరి టీడీపీ ఎమ్మెల్యేలు సైకిల్ దిగిపోతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి తగినట్లుగానే వారి కదలికలు కూడా ఉన్నాయి. కొందరి ఎమ్మెల్యేలు తమపైన అసత్య ప్రచారం జరుగుతోంది అని చెబుతున్నారు తప్ప కచ్చితంగా తాము పార్టీలోనే ఉంటామని మాత్రం చెప్పడంలేదు. 

 

ఈ పరిణామాల నేపధ్యం చూసుకున్నపుడు వీరిలో చాలా మంది వైసీపీ కి జై కొడతారని  అంటున్నారు. ఈ మేరకు వైసీపీ అధినాయకత్వం కూడా పచ్చ జెండా ఊపేసినట్లుగా తెలుస్తోంది. ఈ నెల మూడవ వారం నుంచి ఏపీ అసెంబ్లీని నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ నెల 19న రాజ్య సభ ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలకు ఫిజికలుగానే అటెండ్ అయి ఓటు చేయాల్సిఉంటుంది. దాంతో దానికంటే ముందే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం డిసైడ్ అవుతోంది.

 

ఆ సమావేశాల నాటికి టీడీపీలో నిట్ట నిలువు చీలిక తీసుకురావాలని, తద్వారా చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష స్థానం లేకుండా చేయాలని ఒక వ్యూహం ప్రకారం కధ సాగుతోందని అంటున్నారు. ఒక వర్గం టీడీపె నుంచి వేరు పడితే వారిని ప్రత్యేక గ్రూపుగా కూడా సభలో గుర్తిస్తారు. టీడీపీ కంటే వారే ఎక్కువ సంఖ్యలో ఉంటే మాత్రం వారికే మొదట అవకాశాలు కూడా ఇస్తారు.

 

ఓ విధంగా అసెంబ్లీలో టీడీపీ ఉనికి లేకుండా చేయాలని, బాబును ఓ సాధారణ ఎమ్మెల్యేగా చేయాలని వ్యూహం పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. మరి మిగిలిన వివరాలు అన్నీ కూడా త్వరలోనే రాజకీయ వెండితెర మీద చూడాల్సిందే.

 

మరింత సమాచారం తెలుసుకోండి: