ఏపీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. లాక్‌డౌన్‌ కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన నేపథ్యంలో ఆయా అంశాలను కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో, పోలవరం నిధుల గురించి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్‌తో చర్చించాలని సీఎం వైయస్‌ జగన్‌ భావించారు. షెడ్యుల్‌ ప్రకారం తాడేపల్లి నుంచి మంగళవారం ఉదయం సీఎం ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉండగా అనూహ్యంగా ఈ పర్యటన వాయిదా పడింది.

 

 

లాక్ డౌన్ సడలింపుల సంప్రదింపులు, మహారాష్ట్ర, గుజరాత్ లలో తుఫాన్ తీవ్రత అధికంగా ఉన్నందున కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా బిజీగా ఉన్నందువల్లే ఈ పర్యటన వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఢిల్లీ పర్యటనలో అమిత్ షాను కలవడమే ముఖ్యం కనుక.. ఆయన్ను కలవనప్పుడు ఢిల్లీ వెళ్లడం ఎందుకని సీఎం కూడా పర్యటన రద్దు చేసున్నారు. అయితే ఈ పరిణామాన్ని తమకు అనుకూలంగా మలచుకుంది తెలుగుదేశం అనుకూల మీడియా.

 

 

ఏపీ బీజేపీ నేతల ఫిర్యాదు కారణంగానే జగన్ కు అమిత్ షా అపాయింట్ మెంట్ కాన్సిల్ అయిందని ప్రచారం మొదలు పెట్టింది. తాజాగా నిమ్మగడ్డ విషయంలో హైకోర్టు తీర్పు సర్కారుకు వ్యతిరేకంగా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో బీజేపీ పెద్దలు జగన్ పట్ల గుర్రుగా ఉన్నారని తెలుగు దేశం అనుకూల మీడియా కథనాలు వండివారుస్తోంది. అంతే కాదు.. ఈ విషయంలో చివరికి గవర్నర్ పై కూడా అమిత్ షా అసంతృప్తిగానే ఉన్నారని ప్రచారం చేస్తోంది.

 

 

అవకాశం వచ్చినప్పుడే జగన్ ను కుమ్మేయాలని భావిస్తున్న తెలుగుదేశం అనుకూల మీడియా ఈ అంశాన్ని బాగా వాడేసుకుంటోంది. జగన్ తో కేంద్ర నేతలు సన్నిహితంగా ఉన్నారన్న భావన కలిగితే ఏపీలో బీజేపీ ఎదగడం కష్టమవుతుందని ఏపీ బీజేపీ నేతలు ఢిల్లీ పెద్దలకు కంప్లయింట్‌ చేశారని కూడా చెబుతోంది పసుపు మీడియా.

 

మరింత సమాచారం తెలుసుకోండి: