కరోనా ప్రభావం తో దాదాపు నెలన్నర క్రితమే జరగవలసిన పదో తరగతి పరీక్షలు ఆంధ్ర ప్రదేశ్ లో వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ లో కొన్ని ముఖ్యమైన సడలింపులు మరియు మినహాయింపులు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా వ్యవస్థ మళ్లీ పదో తరగతి పరీక్షలను వీలైనంత త్వరగా జరిపించాలని నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి జూలై 10 నుండి పదవ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే 12 పేపర్లను 6 పేపర్లుగా కుదించిన ఏపీ విద్యా మండలి దీనిపై మరిన్ని కసరత్తులు చేస్తోంది.

 

IHG

 

ఇందులో భాగంగా నిన్న విజయవాడలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అధికారులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సమీక్ష జరిపి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మొత్తం ఎనిమిది లక్షల మంది ఆంధ్రప్రదేశ్ లో పదవ తరగతి పరీక్షలు రాయగా…. ఒక సెంటర్ లో కేవలం 10 నుండి 12 మంది విద్యార్థులు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకుంటున్నందున ముందు అనుకున్న 2882 పరీక్ష కేంద్రాలు కాస్తా ఇప్పుడు 4184 పరీక్ష కేంద్రాలు అయ్యాయి. ఇకపోతే ప్రతి పరీక్ష గదిలో మాస్క్ లు శానిటైజర్ లతోపాటు టీచింగ్ స్టాఫ్ కి గ్లౌజులు అలాగే ప్రతి ఒక్క పరీక్ష కేంద్రంలో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించడం కోసం దాదాపు 4500 కోట్ల స్కానర్ లను అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

 

IHG

 

ఇప్పటికే ఉన్న కంటైన్మెంట్ జోన్ లలో పరీక్షా కేంద్రాలు లేవు, ఒకవేళ కొత్త కంటైన్మెంట్ జోన్స్ వచ్చినా ఇమ్మీడియట్ గా పరీక్ష కేంద్రం మార్చేలా ప్రత్యామ్న్యాయాలు రూపొందించాం. అలాగే ఓపెన్ స్కూల్ పరీక్షలకు కూడా ఇదే తరహాలోనే గతంలో ఉన్న 580 పరీక్షా కేంద్రాలను 1022కి పెంచామనిమంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: