కరోనా వైరస్ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఆయా ప్రభుత్వాలు వారి అకౌంట్లో నగదు జమ చేస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే  రెండు విడతలుగా ఈ డబ్బులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జమచేయగా.. తెలంగాణ ప్రభుత్వం ఈ నెల డబ్బులు జమ చేయడం లేదని ప్రకటించిన విషయం తెలిసిందే.. కానీ కేంద్రం మాత్రం మూడు నెలల పాటు జన్ ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.500 అందిస్తామని గతంలోనే ప్రకటించింది.. చెప్పినట్లుగానే ఇప్పటి వరకు రెండు నెలల నగదును వారి ఖాతాలో జమపరిచింది.. ఇక ఇప్పుడు మూడోవిడత నగదును కూడా అందించడానికి సిద్దపడింది..

 

 

ఈ క్రమంలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వ గరీబ్‌ కళ్యాణ్‌ పథకం ద్వారా జన్‌ధన్‌ బ్యాంకు ఖాతాలున్న వారికి మూడో విడత సొమ్ములు జమయ్యాయి. ఇప్పటి వరకు రెండు విడతలుగా ఏప్రిల్‌, మే నెల నగదు రూ.1000 అందించగా, జూన్‌కు సంబంధించి జిల్లావ్యాప్తంగా 4.46 లక్షల మంది మహిళా జన్‌ధన్‌ ఖాతాదారులకు రూ.500 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసినట్టు జిల్లా లీడ్‌ బ్యాంకు మేనేజరు రామచంద్రరావు ప్రకటించారు. ఖాతాదారులు ఈ నెల 5వ తేదీ నుంచి సొమ్ము తీసుకోవచ్చని, ఇక ఈ నగదు 10వ తేదీ తరువాత అందరికి పూర్తిగా అందుబాటులో ఉంటుందని, ఆ తర్వాత ఏ రోజు అయినా ఆయా బ్యాంకు ఖాతాలు కలిగిన వారు అక్కడికి వెళ్లి తీసుకోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు..

 

 

ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెల్లరేషన్ ‌కార్డుదారులకు అందజేస్తున్న రూ.1500 నగదును ఈ నెల జమచేయడం లేదని తెలిపింది.. కాబట్టి తెల్లరేషన్ ‌కార్డు ఉన్న పేదలకు డబ్బులు లేనట్లే.. కాగా ఈ వైరస్ వల్ల విధించిన లాక్‌డౌన్ కారణంగా ఎందరో ఉపాధిని కోల్పోగా, చాలమంది పేదలు సగంకడుపు నింపుకుని, బాధపడుతూ కష్టాలను అనుభవిస్తున్నారు. ఇక వలస కూలీల బాధలైతే కన్నీరు తెప్పించేలా ఉన్నాయి.. ప్రభుత్వాలు చేసే సహయం వల్ల పూర్తిగా పూటగడవక పోయినా ఏదో చల్లబడవచ్చు అనుకుంటున్న వారిలో కొందరికి మాత్రం ఈ విడత చుక్కెదురే.. 

మరింత సమాచారం తెలుసుకోండి: