ఆంధ్ర ప్రదేశ్ లో తాజాగా 82  మందికి కరోనా సోకింది. గత 24 గంటల్లో 40 మంది కోవిడ్19 బారి నుంచి కోలుకుని పూర్తి ఆరోగ్యంతో డిశ్ఛార్జ్ కాగా, ఎలాంటి కోవిడ్ మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరట కలిగించే అంశం. అలాగే ఒక 40 మంది కూడా వైరస్ బారి నుండి పూర్తిగా కోలుకొని డిశ్చార్జి కావడం గమనార్హం.

 

గత 24 గంటల్లో 12,613 శాంపిల్స్ పరీక్షించగా 82 మందికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3200కు చేరింది. ఇప్పటి వరకు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకుని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 2,209కి చేరింది. ప్రస్తుతం వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో 927 మంది చికిత్స పొందుతున్నారు.

 

IHG

 

ఇక తెలంగాణలో మొన్న రికార్డు స్థాయి లో ఒక్క రోజే 199 కేసులు నమోదు కావడం గమనార్హం. అయితే నిన్న మాత్రం అందులో సగం అనగా 99 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య శాఖ బులిటెన్ లో వెల్లడించింది. గ‌డిచిన‌ 24 గంట‌ల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో 99 కేసులు న‌మోదు కాగా..ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2891కి చేరింది. న‌లుగురు మ‌ర‌ణించ‌గా.. రాష్ట్రంలో క‌రోనా మృతుల సంఖ్య 92కి పెరిగింది. అలాగే ఇవాళ 35 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు

 

IHG

 

గత రెండు వారలుగా హై కోర్టు వారి ఆదేశాల మేరకు టెస్టుల సంఖ్య పెంచిన తెలంగాణ ప్రభుత్వం అత్యధిక సంఖ్యలో పాజిటివ్ కేసులు బయటపడడం చూస్తూనే ఉంది. నేపథ్యంలో హై కోర్టు గత నెల రోజులుగా వారు చేసిన టెస్టుల డేటా ను ఇవ్వమని ఆదేశించి. అయితే హై కోర్టు అంతలా క్లాస్ పీకినా ఇప్పటికీ మిగతా రాష్ట్రాల లాగా తెలంగాణ ప్రభుత్వం రోజుకు ఎన్ని టెస్టులు నిర్వహిస్తున్నారు అన్న విషయాన్ని వెల్లడించకపోవడం గమనార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: