తనకు రాజకీయంగా అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడని భావిస్తున్న తన సొంత అన్నయ్య వ్యవహారంలో పవన్ కొత్త చిక్కులు ఎదుర్కొంటున్నారు. తరచుగా ఏదో ఒక వివాదాస్పద అంశంతో వార్తల్లో వ్యక్తిగా పవన్ సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు ఉంటూ వస్తున్నారు. కొద్ది రోజుల క్రితం మహాత్మా గాంధీని చంపిన నాథురం గాడ్సే గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వ్యవహారంలో పవన్ చిక్కులే ఎదుర్కొన్నారు. చివరికి ఆ వ్యాఖ్యలతో జనసేనకు కానీ, నాకు గాని సంబంధం లేదని పవన్ వివరణ ఇచ్చుకున్నారు.  ఇక మొదటి నుంచి తెలుగుదేశం పార్టీతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సన్నిహితంగా ఉంటూ వస్తున్న పవన్ కు ఇప్పుడు నాగబాబు టిడిపి పైన విమర్శలు చేయడం ఇబ్బందికరంగా మారింది. 

IHG


 కొద్ది రోజుల క్రితం సినీ హీరో టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి మధ్య తలెత్తిన వివాదంలో నాగబాబు ఎంట్రీ ఇచ్చారు.  బాలయ్య కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా కొంతమంది ఘాటుగా సమాధానం ఇవ్వడంతో తెలుగుదేశం పార్టీ పైన నాగబాబు విమర్శలు చేశారు. 2014 ఎన్నికల్లో ఎన్నో ఆశలతో ప్రజలు తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెడితే, వారి ఆశలను అడియాసలు చేశారని, అమరావతిలో పేద రైతుల భూములు సేకరించి ఇన్ సైడర్ ట్రేడింగ్ పాల్పడ్డారంటూ ఘాటుగా విమర్శించారు. వీటికి కూడా ఇప్పుడు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి పవన్ కు ఏర్పడింది. 

IHG


ఎందుకంటే ప్రస్తుతం జనసేన నాయకుడు గా పవన్ ఉన్నారు. అదీకాకుండా 2019 ఎన్నికల ఫలితాలు రిపీట్ కాకూడదు అంటే 2024 ఎన్నికల నాటికి టిడిపి మద్దతు కూడా అవసరమైతే తీసుకోవాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. ఇప్పటికే బీజేపీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు పవన్. మరి కొద్ది రోజుల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కూటమిగా ఏర్పడే అవకాశం లేకపోలేదు. ఈ తరుణంలో టిడిపి నాయకులకు ఆగ్రహం తెప్పించే విధంగా నాగబాబు వ్యాఖ్యానించడం పవన్ కు మింగుడు పడటం లేదు. నాగబాబు ధోరణితో ముందు ముందు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందనే ఆందోళనలో పవన్ ఉన్నట్టు గా కనిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: