కరోనా వైరస్.. ఇది వచ్చిన మొదట్లో ఇండియా వణికిపోయింది. జనం కూడా చాలా భయపడ్డారు. అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వాలు కూడా చాలా కట్టడి చేశాయి. కానీ..ఇప్పుడు కరోనా అంటే జనంలోనూ భయం పోయింది. అటు ప్రభుత్వాలు కూడా సడలింపులతో లైట్ గా తీసుకుంటున్నాయి. కానీ..కరోనా కేసులు వందలు, వేలల్లో ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకున్న ప్రభుత్వాలు లక్షల్లోకి చేరాక సడలింపులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

 

 

ఇండియాలో కరోనా వ్యాప్తి లెక్కలు చూస్తే.. గుండెలు అదిరిపోవాల్సిందే. ఇండియాలో మొత్తం పాజిటివ్ కేసులు 2 లక్షలు దాటాయి. అయితే దేశంలో లక్ష కేసులు దాటిన 15 రోజుల్లోనే ఈ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటింది. అంటే లక్ష కేసులు 2 లక్షలు అయ్యేందుకు 15 రోజులు పట్టింది. కరోనా వైరస్ ఇలాగే ఉంటే.. రెండు నెలల వ్యవధిలో ఇండియాలో 32 లక్షల కేసులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

 

 

ప్రపంచంతో పోలిస్తే మొదట్లో ఇండియా పరిస్థితి చాలా లైట్ గా ఉండేది కానీ మన జనాభా ఎక్కువ కావడంతో ఇప్పడు కేసుల సంఖ్య శరవేగంగా పెరుగుతోంది. ఇప్పుడు ప్రపంచంలోనే 7వ స్థానానికి ఇండియా చేరింది. ఈ కేసుల జోరు ఇలాగే సాగితే.. ప్రస్తుతం ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉన్న అమెరికాను దాటేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.

 

 

ప్రస్తుతానికి ఇండియాలో కరోనా కారణంగా 5,600 మంది చనిపోయారు. మరో ఆందోళన కలిగించే విషయం ఏంటంటే.. ఇండియాలో కరోనా టెస్టులు చాలా తక్కువగా జరుగుతున్నాయి. తక్కువ టెస్టులు జరిగితేనే ఇన్ని లక్షల్లో కేసులు వస్తుంటే.. పూర్తి స్థాయిలో కరోనా ఇంకా ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో తలచుకుంటే ఒళ్లు జలదరిస్తోంది. ప్రభుత్వాలు దీన్ని లైట్ గా తీసుకుంటే.. ఇండియాలో కరోనా మరణ మృదంగం కొనసాగకతప్పదేమో..

 

మరింత సమాచారం తెలుసుకోండి: