ఈ ఏడాది 2020 అస్సలు బాగాలేదని ప్రతి ఒక్కరి నోట వినిపిస్తున్న మాట.. మనుషు ప్రాణాలు మాత్రమే కాదు ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థ కూడా అతలాకుతలం అయ్యింది.  ఫిబ్రవరి మాసంలో చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన కరోనా వైరస్ అతి తక్కువ కాలంలో ప్రపంచం మొత్తం వ్యాపించింది. కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతోన్న తరుణంలో కొత్త కొత్త విపత్తులు ప్రజలను వణికిస్తున్నాయి. అయితే కరోనా వల్ల ఎన్ని ప్రాణాలు పోయాయో.. కేసులు నమోదు అవుతున్నాయో ప్రతిరోజూ చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కొత్త సమస్యలు తలెత్తుతున్నాయి. ఇటీవల తూర్పు ఆఫ్రికా, ఇరాన్, సౌదీ అరేబియా, ఆప్ఘనిస్తాన్, పాకిస్తాన్, భారత్‌పై మిడతల దండు దండెత్తిన సంగతి తెల్సిందే.

 

పంటలపై దాడులు చేస్తూ అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి.  ఇది చాలదని ఎబోలా వైరస్ ఒకటి మళ్లీ విజృంభిస్తుంది.   తాజాగా రష్యాలో మనుషుల రక్తాన్ని పీల్చి చంపే, అలాగే పిల్లల్లో మెదడు వాపు వ్యాధిని కలిగించే పినుజులు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ఇప్పటికే 8,215 పినుజు కాటు కేసులు నమోదయ్యాయి. వీరిలో 2,125 మంది పిల్లలు ఉండడం విషాదకరం. సెర్‌డ్లోస్క్ ప్రాంతంలో 17,242 పినుజు కాటు కేసులు వచ్చాయని అధికారులు పేర్కొన్నారు. సాధారణంగా చదరపు కి.మీ.కు 0.5 పినుజులు ఉంటాయి.

 

ఇవి ఒక్కసారి మనుషుల రక్తం రుచి చూస్తే అంతే.. రక్త పిశాచుల్లా చెలరేగిపోతుంటాయి. సైబీరియా ప్రాంతంలో సాధారణం కంటే 428 రెట్లు అధికంగా పినజులు కనిపిస్తున్నాయి. అలాగే క్రాస్నోయార్స్క్ ప్రాంతంలో ప్రతి చదరపు కి.మీ. సగటున 214 పినజులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రష్యా ప్రజలు తీవ్ర భయబ్రాంతులకు గురవుతున్నారు. ఇప్పటికే కరోనా కేసుల్లో టాప్ 3లో ఉన్న రష్యాకు.. ఇప్పుడు పినుజుల రూపంలో మరో ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.ఇక బ్రెజిల్ తర్వాత కొత్త కేసుల్లో రష్యా, ఇండియా పోటీ పడుతున్నాయి. ఇప్పటికైతే... మూడోస్థానంలో రష్యానే నిలుస్తోంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: