వరంగల్ డాక్టర్లు అద్భుతం చేశారు. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు, ముఖానికి భారీ దెబ్బలు తగిలి కోమాలోకి వెళ్ళిన ఓ యువకుడికి ప్లాస్టిక్ సర్జరీ చేసి ప్రాణాపాయం నుంచి అతడిని కాపాడారు డాక్టర్స్. వరంగల్ లో ఉన్న ములుగు రోడ్డులోని గార్డియన్ హాస్పిటల్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. హాస్పిటల్ నిర్వహకుడు డాక్టర్ పి. కాళి ప్రసాదరావు తెలిపిన వివరాల మేరకు... పరకాల మండలం నార్లాపూర్ గ్రామానికి చెందిన రామచందర్ అనే యువకుడు వారం రోజుల ముందర పరకాల నుంచి తన బైక్ పై వెళ్తుండగా మార్గమధ్యంలో బ్రిడ్జి వద్ద ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు.

IHG'ప్లాస్టిక్‌ సర్జరీ'


ఈ ప్రమాదంలో రామచందర్ ముఖం పై భాగాన పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోయింది. అంతే కాదు తీవ్ర రక్తస్రావం కూడా జరిగి వ్యక్తి కోమాలోకి వెళ్లిపోయాడు. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు పలు హాస్పిటల్ లో చూపించిన సరైన చికిత్స ఎక్కడ లభించకపోవడంతో వరంగల్ లో ఉన్న గార్డెన్ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అయితే రామచందర్ కోమాలో ఉన్న సరే వైద్యులు శస్త్రచికిత్స చేయడానికి సిద్ధపడ్డారు. రామచందర్ ముఖం మీద యువకులు నుజ్జునుజ్జు అవడంతో వెంటిలేటర్ సహాయంతో ప్లాస్టిక్ సర్జన్ డాక్టర్ ఉపేందర్, డాక్టర్ శంతన్ కుమార్  వారి టీం కలిసి ఏకంగా 12 గంటలపాటు నిర్విరామంగా శ్రమించి ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం చేశారు.

IHG


ముఖం మీద ఎటువంటి ఎముకలు కనుపరాకుండా ముక్కు, కన్ను వంటి అవయవాలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్లాస్టిక్ సర్జరీని విజయవంతం చేశారని వారు తెలియజేశారు. ఇకపోతే తాజాగా రామచందర్ ప్రాణాపాయం నుంచి బయటపడి క్షేమంగా ఉన్నాడని సదరు డాక్టర్ బృందం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: