చిరంజీవి పాపులారిటీని ఉపయోగించుకొని తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టిన నాగబాబు ఒకటి రెండు సినిమాలలో హీరోగా నటించాడు కానీ తనలో హీరో అయ్యే మెటీరియల్ లేదని ప్రేక్షకులు గట్టిగానే చెప్పారు. దాంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అడపాదడపా సినిమాల్లో నటిస్తూ కొంత డబ్బులు సంపాదించాడు. అయితే ఆ సంపాదించిన డబ్బులు అన్నీ రామ్ చరణ్ మూవీ అయిన ఆరంజ్ నిర్మాణానికి ఖర్చు చేశాడు. దురదృష్టవశాత్తూ ఆ సినిమా అట్టర్ ప్లాప్ కావడంతో తన డబ్బులు అన్నీ పోయాయి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ అతడిని ఆర్థికంగా ఆదుకున్నాడు. కాలక్రమేణా జబర్దస్త్ షోలో న్యాయనిర్ణేతగా చేరి డబ్బులు బాగానే సంపాదించాడు కానీ చివరికి తనకు అన్నం పెట్టిన జబర్దస్త్ షో ని వదిలేసి దానిపై అనేక విమర్శలు గుప్పించి అందరి చేత ఛీ అనిపించుకున్నాడు.


అప్పట్లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో రాజకీయ నేతగా బాధ్యతగా వ్యవహరించాలని నాగబాబు కానీ అది జరగలేదు. దాంతో తన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలో రాజకీయ రంగ ప్రవేశం చేసి ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేస్తూ ప్రజలకు ఉపయోగపడని విమర్శలను అధికార పక్షంపై విసురుతున్నాడు. మొన్నీమధ్య మహాత్మా గాంధీని చంపిన నాథూరామ్ గాడ్సే దేశభక్తుడని, కానీ మీడియానే అతడిని తప్పుగా చూపించిందని... అతను గురించి అందరూ తెలుసుకోవాలని హితవు పలికాడు. మన భారతదేశానికి స్వాతంత్ర్యం రావడానికి ఒక అద్భుతమైన లీడర్ గా స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపిన మహాత్మా గాంధీని చంపిన ఒకడు దేశ భక్తుడు అని అనడం అందరి ఆగ్రహానికి కారణమయ్యింది. జానకి తన అన్నయ్య చిరంజీవి మహాత్మా గాంధీ గురించి శంకర్ దాదా ఎం బి బి ఎస్ సినిమా తీసి గాంధీ గురించి గొప్పగా ప్రేక్షకులకు తెలిపాడు. కానీ నాగబాబు మాత్రం మహాత్మా గాంధీ గురించి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తూ అందరినీ విస్మయానికి కారణమవుతున్నాడు. 


ఇక పవన్ కళ్యాణ్ కూడా తన అన్నయ్య నాగబాబు అన్న మాటలకు ఎటువంటి సమర్థత ఇవ్వాలో తెలియక ఆయన అన్న మాటలకు జనసేన పార్టీకి సంబంధమే లేదని బహిరంగంగా చెప్పుకొచ్చాడు. టిడిపి పార్టీ జనసేన పార్టీ అప్పట్లో మిత్రులుగా మెల్లిగా అన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నాగబాబు మాట్లాడుతూ అమరావతిలో భూకబ్జాలు, ఇన్ సైడ్ ట్రేడింగ్, రియల్ ఎస్టేట్ దందాలు నడిచాయని పరోక్షంగా తన తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడడం లేదు. నిజానికి పవన్ కళ్యాణ్ అమరావతి లో ఒక పొలం తక్కువ ధరకే కొన్నాడని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ నిజమే అన్నట్లు నాగబాబు వ్యాఖ్యలు చేస్తుండడం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి తల నొప్పిగా మారుతుంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బీజేపీ తో పొత్తు పెట్టుకున్నాడు. జగన్ని సీఎం పదవి నుంచి దించడానికి భవిష్యత్తులో తాను టిడిపి పార్టీతో కలిసే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ జగన్ ని సీఎం పదవి నుంచి దించడానికి ఏదైనా చేస్తాడు. అయితే నాగబాబు మాత్రం టిడిపిని డైరెక్ట్ గా విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తును సర్వ నాశనం చేస్తున్నాడు. అందుకే నాగబాబుని పార్టీకి దూరంగా ఉంచుతూ నాదెండ్ల మనోహర్ తో తన రాజకీయ విషయాలు పంచుకుంటున్నాడు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: