తెలంగాణ, ఆంధ్ర ముఖ్య మంత్రులు ఇద్దరూ మంచి స్నేహితులు. ఇద్దరూ ఒకరికొకరు సహకరించుకుంటూ అన్ని విషయాల్లో క్లారిటీగా ఉంటూ వస్తున్నారు. ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు, మెజార్టీ ప్రజలు సంతృప్తి కలిగే విధంగా పరిపాలన చేయడంలో ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికి వారే తీసిపోరు అన్నట్టుగా ఉంటారు. ఈ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరూ దేశానికి ఆదర్శంగా నిలుస్తూ దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.ఈ ఇద్దరిలో ఏ ముఖ్యమంత్రి పనితీరు బాగుంది అంటే చెప్పడం కష్టమే. కానీ ఆ విషయం ఓ సర్వే ద్వారా తేలిపోయింది. ఇదే విషయమై సీ ఓటర్ సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సమయంలో ప్రభుత్వాల పనితీరు ఏవిధంగా ఉంది అనే విషయంపై దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో మోస్ట్ పాపులర్ .. లిస్ట్ పాపులర్ సీఎం లు ఎవరు అనే విషయంపై సర్వే వివరాలను ఆ సంస్థ విడుదల చేసింది. 

IHG


మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో ఏపీ సీఎం జగన్ నాలుగో స్థానంలో ఉండగా, లిస్ట్ పాపులర్ సీఎం జాబితాలో కెసిఆర్ చిట్టచివరి స్థానంలో ఉన్నారు. అలాగే మోస్ట్ పాపులర్ సీఎం జాబితాలో మొదటి స్థానంలో ఒరిస్సా  సీఎం నవీన్ పట్నాయక్ ఉండగా, రెండో స్థానంలో ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ బఘెల్‌కు కు మూడో స్థానం, కేరళ సీఎం పినారై విజయన్ , ఏపీ సీఎం జగన్ కు నాలుగో స్థానం దక్కింది. కానీ తెలంగాణ సీఎం కేసీఆర్ విషయంలో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. నిత్యం మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజల్లో ధైర్యం నింపే విధంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. మీడియాలో ఎక్కువగా కనిపిస్తూ వచ్చారు. అయినా ఆయన దేశంలో లిస్ట్ పాపులర్ సీఎం లిస్ట్ లో ఉండడం ఆశ్చర్యం కలిగించే అంశమే. 


ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా సీ ఓటర్ సర్వే లో అనుకూలంగా ఫలితాలు వచ్చాయి .ఆయనకు 60 శాతం మంది పైగా మద్దతు పలకగా, రాహుల్ గాంధీ కి 30 శాతం మందికి పైగా మద్దతు పలికారు. ఇక కేంద్రం ప్రభుత్వ పనితీరుపై వివిధ రాష్ట్రాల్లో ఉన్న స్పందన కూడా విభిన్నంగా వచ్చింది. గతంలో మోదీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర వ్యతిరేకత ఉండేది. అదే విధంగా ఉండేది. కానీ ఈసారి మాత్రం కేంద్ర ప్రభుత్వం మెచ్చుకునే విధంగా ఫలితాలు వచ్చినట్లు సీ ఓటర్ సర్వే తేల్చింది. 83 శాతానికి పైగా ఆంధ్ర ప్రజలు మోదీ పరిపాలనకు మద్దతు పలికారు. ప్రస్తుతం ఏపీ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి కంటే సమర్ధవంతంగా పని చేశారనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తం కావడంతో, వైసీపీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: