అదేంటి.. కరోనా ఏంటి భారతీయుల సత్తా చాటటం ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి.. కరోనా తాజా గణాంకాలు ఓసారి పరిశీలిస్తే భారతీయల సత్తా ఏంటో అర్థమవుతుంది. ఎందుకంటే.. భారత దేశం ప్రస్తుతం కరోనా కేసుల్లో దూసుకుపోతోంది. దాదాపు 2 లక్షలకు పైగా కరోనా కేసులు ఇండియాలో నమోదయ్యాయి. కరోనా కేసుల విషయంలో మొదట్లో ఎక్కడో ఉండే ఇండియా ఇప్పుడు ఏడో స్థానానికి పాకిపోయింది.

 

 

మరి ఇంతలా కరోనా వ్యాపిస్తుంటే ఇక ఇండియన్ల సత్తా ఏముంది అంటారా.. అక్కడే ఉంది అసలు విషయం. అదేంటంటే.. కరోనా కేసుల సంఖ్యలో ఇండియా దూసుకుపోతోంది. కానీ కరోనా చావుల విషయంలో మాత్రం ఇండియా తక్కువగానే ఉంది. అంటే.. ఇండియాలో కరోనా వ్యాపిస్తున్నా.. ప్రపంచంతో పోలిస్తే కరోనా చావుల సంఖ్య తక్కువే అన్నమాట. కరోనా వచ్చినా దాన్ని తట్టుకునే సత్తా ఇండియన్లలో ఉండబట్టే ఈ విచిత్రం సాధ్యమవుతుందంటున్నారు వైద్య నిపుణులు.

 

 

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనాతో 3 లక్షల 80 వేల మంది వరకూ చనిపోయారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు ఉన్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే 2 లక్షలు కరోనా కేసులు దాటినా మృతుల సంఖ్య మాత్రం 5,800 మాత్రమే.. ఇదే సమయంలో కరోనా కేసుల విషయంలో ఇండియా 7 వ స్థానంలో ఉంటే.. చావుల విషయంలో మాత్రం.. 13వ స్థానంలో ఉంది. అంటే మనకంటే చాలా తక్కువ కేసులు ఉన్న దేశాల్లో కూడా కరోనాతో ఎక్కువ మంది చనిపోతున్నారన్నమాట.

 

 

ఇందుకు అసలు కారణం భారతీయుల్లో ఉన్న వ్యాధి నిరోధక శక్తే అంటున్నారు వైద్య నిపుణులు.. కనీసం లక్ష కేసులు కూడా లేని మెక్సికో, బెల్జియం, కెనడా, నెదర్లాండ్స్ వంటి దేశాల్లో కూడా మన దేశంలో కంటే ఎక్కువ మందే చనిపోయిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: