పాపం సుధాకర్ ..! అంటూ జాలిపడాలో లేక ఓ రాజకీయ పార్టీ ఆడించిన నాటకంలో బలిపశువు అయ్యాడో తెలియదు కానీ, ఇప్పుడు ఆయన వ్యవహారం మాత్రం హాట్ టాపిక్ గా ఏపీలో మారింది. నర్సీపట్నం ప్రభుత్వ మత్తు  డాక్టర్ సుధాకర్ వ్యవహారం మొదటి నుంచి ఆసక్తికరంగానే మారింది. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు మాస్కులు, తదితర రక్షణ పరికరాలు ఏవి ప్రభుత్వం అందించడం లేదంటూ మీడియా ముఖంగా ఆయన ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ఆ తర్వాత అనేక ఆరోపణలపై ఆయన సస్పెండ్ అవ్వడం జరిగాయి. ఈ వ్యవహారంలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మాజీ మంత్రి హస్తం ఉందనే వార్తలు వచ్చాయి. ఇక డాక్టర్ సస్పెన్షన్ తో కథ ముగిసింది అనుకుంటున్న సమయంలో మళ్లీ హఠాత్తుగా ఆయన తెరపైకి వచ్చారు.

IHG


 మద్యం సేవించి ఆయన రోడ్డుపై నానా హంగామా చేయడంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని మానసిక వైద్యశాలలో చేర్పించారు. ఇక ఈ వ్యవహారం లో తెలుగుదేశం పార్టీ ఏపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేయడంతో పాటు, ఈ వ్యవహారం హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లడం, దీనిపై స్పందించిన హైకోర్టు ఏపీ ప్రభుత్వం పై ఆగ్రహం వ్యక్తం చేయడంతోపాటు. ఏకంగా దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించి సంచలనం రేపింది ఇక కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సిబిఐ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. ఈ దర్యాప్తులో అనేక విషయాలు బయటపడ్డాయి. అసలు ఈ వివాదంలో ప్రభుత్వ డాక్టర్ పై పోలీసులు ఏ కేసు పెట్టలేదు. రోడ్డుపై నానా హంగామా చేస్తుంటే అతని మానసిక స్థితి సరిగా లేదని అనుమానంతో మెంటల్ ఆసుప త్రి లో చేర్పించారు. 

IHG


అసలు ఆయనను అరెస్టు చేయలేదని ఏపీ పోలీసులు చెబుతున్నారు. కానీ ఈ వ్యవహారంలో తమ తప్పు ఏమీ లేదని అని చెబుతూ 23 మంది సాక్షుల సమాచారంతో 130 కేజీల రిపోర్ట్ ను కూడా పోలీసులు సిబిఐ అందించారు. ఇక ఇప్పుడు వాటిలోని అంశాల ఆధారంగా సి.బి.ఐ ప్రభుత్వ డాక్టర్ సుధాకర్ పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీనికి కారణం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ మద్యం సేవించి, రోడ్డుమీదకు రావడమే కాకుండా ప్రజాప్రతినిధులను దూషించడం, మతం పేరుతో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, ఓ కానిస్టేబుల్ మొబైల్ ఫోన్ ధ్వంసం చేయడం, లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి అనేక విషయాలను పరిగణలోకి తీసుకుని సిబిఐ ఆయనపై కేసు నమోదు చేసింది. 


అయితే ఇక్కడ ఒక విషయం అందరికీ అనుమానం కలిగిస్తోంది. కోర్టు ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ఆ దర్యాప్తు సంబంధించిన అంశాలు కాకుండా ఇప్పుడు సొంతంగా వ్యవహరిస్తూ, డాక్టర్ సుధాకర్ పై కేసు నమోదు చేయడం, అలాగే ఒక సాధారణ కేసును కూడా ప్రత్యేఎకంగా చూస్తూ దర్యాప్తు మొదలు పెట్టడం వంటివి ఎవరికీ అంతు పట్టడంలేదు. ఇక ఈ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన టిడిపి ఇప్పుడు సుధాకర్ పై సిబిఐ కేసు నమోదు చేసిన వ్యవహారంపై నోరు మెదపడం లేదు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సీబీఐ ఎటువంటి కేసులను దర్యాప్తు చేయాలి ? తాగి న్యూ సెన్స్, మానసిక స్థితి బాగోలేదని ఆసుపత్రిలో చేరిన ఓ చిన్న కేసు పైన సి.బి.ఐ కేసు నమోదు చేయడం వంటివి  చర్చనీయాంశంగా మారాయి.   

మరింత సమాచారం తెలుసుకోండి: