ఏపీ రాజకీయాలు చిత్రంగా ఉంటున్నాయి. ఏపీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మహా యుధ్ధమే జరుగుతోంది. జగన్ని ఎంత చేద్దామనుకుంటున్నా ఆయన అమాంతం పెరుగిపోతున్నాడు. జగన్ బలం ఎక్కడ ఉంది అంటే జనంలోనే ఉందని తాజా సర్వేలు చెబుతున్నాయి.

 

అధికారంలోకి ఏడాది అయింది. అయినా జగన్ని తగ్గించలేకపోతోంది  టీడీపీ. జగన్ మీద ఎన్ని రాత్రలు రాసినా, రాయించినా కూడా ఆయన ఇమేజ్ ఎప్పటికపుడు పెరుగుతోంది. సాధారణంగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మోజు మెల్లగా తగ్గుతుంది. జగన్ ఇమేజ్ అలా కాకుండా స్టాండ్ అవుతోంది అంటే అది కచ్చితంగా కూడా బలమైన పునాది దిశగా సాగుతోందనుకోవాలి.

 

జగన్ ది గాలివాటం గెలుపు అని ఒకసారి చాన్స్ అడిగితే జనం ఇచ్చేశారు అనుకోవడం కూడా ఇక్కడ పోరపాటు అని సీ ఓటర్ సర్వే నిరూపిస్తోంది. జగన్ గెలుపునకు ఆయనకు ఉన్న అత్యంత ప్రజాదరణ  అతి ముఖ్యకారణమని మళ్ళీ మళ్ళీ  రుజువు అవుతోంది.

 

జగన్ కి మీడియా పూర్తి వ్యతిరేకం. ఆయనకు ఏపీలో ఒక్క రాజకీయ పార్టీ కూడా మద్దతుగా నిలవదు, జగన్ అంటే చాలు అటు కమలం పార్టీ, ఇటు కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఒక్కటి అయిపోతున్నారు. కానీ జగన్ మాత్రం జనాన్నే నమ్ముకున్నారు. ఆ నమ్ముకున్న జనం ఆదరిస్తారా అంటే తప్పక అంటోంది తాజా సర్వే.

 

ఓ విధంగా చూసుకుంటే చంద్రబాబు మీడియా బేబీగా మిగిలిపోయారా అనిపించకమానదు, బాబు మీడియా మేనేజ్ చేస్తున్నారు. తనకున్న పలుకుబడితో ఇతర వ్యవస్థల్లో కూడా సానుకూలత తెచ్చుకుని జగన్ని అల్లరి పెడుతున్నారు. కానీ జగన్ బలాన్ని మాత్రం అసలు తగ్గించలేకపోతున్నారు. 

 

మరి ఇదే రకమైన తీరులో బాబు అండ్ కో ఉంటే మాత్రం డేంజర్ బెల్స్ అని చెప్పకనే చెబుతోంది ఈ తాజా సర్వే. అంటే జనం మద్దతు పొందకుండా జగన్ మీద మీడియాను ఎగదోస్తే కుదిరే వ్యవహారం కాదని ఏడాది క్రితం రుజువు అయింది, ఇపుడు కూడా  అదే జరుగుతోంది. మరి తస్మాత్ తెలుగు పార్టీ జాగ్రత్త అంటోంది ఈ సర్వే.

మరింత సమాచారం తెలుసుకోండి: