హైదరాబాద్ లో దారుణాలు రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి.. సిటీ పరంగా ప్రజలు ఎంత ముందున్నా కూడా నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి.. అందుకే అన్నీ పెరుగుతున్న కూడా క్రైమ్ రేటు కూడా పెరుగుతుంది. ఇంకా చెప్పాలంటే సిటీ పగలు ఎంత బిజీగా ఉన్నా కూడా  రాత్రి అయితే నేరాలకు హైదరాబాద్ మహానగరం అడ్డాగా మారింది..డ్రగ్స్ ఏరులై పారుతుంది.. మాదక ద్రవ్యాల మార్పిడి ఎంత నిఘా ఉన్న జరుగుతుంది.. తాజాగా భారీ మొత్తంలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు..

 

 


వివరాల్లోకి వెళితే..హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ భూతం బయటపడింది. మంగళవారం పోలీసులు భారీగా డ్రగ్స్ చెలామణిని గుర్తించారు. ఫేస్ మాస్క్‌ల పేరుతో ఇరు రాష్ట్రాల్లో తిరుగుతూ ఈ ముఠా డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. హైదరాబాద్, బెంగళూరులో పెద్ద మొత్తంలో డ్రగ్స్ విక్రయాల దందా జోరుగా సాగుతున్నట్లుగా తేల్చారు. మంగళవారం ముగ్గురి దగ్గర నుంచి 54 గ్రాముల కొకైన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 

 

 

బెంగళూరులో ఓ నైజీరియన్ నుంచి 70 గ్రాముల కొకైన్‌ను హైదరాబాద్‌కు చెందిన వారు కొనుగోలు చేశారు. వీరిని పరంజ్యోతి సింగ్, అమిత్ కుమార్‌గా గుర్తించి ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. కొవిడ్ రవాణా పాసులు తీసుకొని ఈ ముఠా డ్రగ్స్ వ్యాపారం జోరుగా సాగిస్తున్నట్లుగా గుర్తించారు. పోలీసులకు ముందస్తుగా విశ్వసనీయ సమాచారం అందడంతో పక్కాగా ప్రణాళిక వేసి సికింద్రాబాద్‌లో నిందితులను పట్టుకున్నారు. వీరి వయసు 30 నుంచి 34 మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు.

 

 

ఒక గ్రాము 7 వేలు ఉన్నా కూడా భారీ మొత్తంలో డ్రగ్స్ దందా నడుస్తుండటంతో ఇక్కడ హైదరాబాదీలు భయ బ్రాంతులకు గురవుతున్నారు.. బెంగళూరులోని ఓ నైజీరియన్ నుంచి కొనుగోలు చేశారని గుర్తించారు. మే 30న బెంగళూరులో ఈ లావాదేవీ ముగిశాక హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు. అప్పటికే వీరిద్దరూ కలిసి 16 గ్రాముల కొకౌన్‌ను సేవించినట్లుగా వివరించారు. మాదక ద్రవ్యాల చట్టం కింద వీరిద్దరిపై కేసు నమోదు చేశామని, వారి నుంచి కొకైన్, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబాద్ పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: